పెళ్లి.( Marriage ) ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకొని తంతు.ఈ పెళ్లి కార్యక్రమం.పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకొనే వేడుక కాబట్టి అది జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలని అందరూ అనుకోవడం సర్వసాధారణం.మన పెద్దల కాలంలో వివాహాలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణంగా, సాంప్రదాయ బద్దంగా జరిగేవి.అయితే కాలం మారుతున్న కొద్ది మనుషుల్లో వచ్చిన ధోరణి ప్రకారం వివిధ కార్యక్రమాలను పెళ్లి తంతులో చేరుస్తూ వస్తున్నారు.
దీంతో వధూవరులు తమ పెళ్లిని రంగరంగ వైభవంగా చేసుకోవాలని., అందరికంటే కాస్త వెరైటీగా చేసుకోవాలని భావిస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో పెళ్లి తంతులో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే వావ్ అనిపించేలా ఉండగా.మరికొన్ని అయితే షాక్ కు గురిచేస్తున్నాయి.
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి కారణంగా పెళ్లికొడుకు కు( Groom ) గట్టి షాకే తగిలిందని చెప్పవచ్చు.ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.
ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో.వధూవరులు ఇద్దరు సాంప్రదాయబద్ధంగా పెళ్లి దండలు( Garland ) మార్చుకోవాలి.అయితే ఇందుకు గాను వారు మార్చుకునే పూలదండలను డ్రోన్( Drone ) సహాయంతో వధూవరుల ఇద్దరికీ అందించేలా ప్లాన్ చేసింది ఈవెంట్ మేనేజ్మెంట్.అయితే ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన డ్రోన్ సహాయంతో పూలమాలను వరుడికి ఇచ్చే సమయంలో అనుకోకుండా డ్రోన్ క్రాష్ అయ్యింది.
మొదటగా డ్రోన్ సహాయంతో పూలమాలను వరుడి వద్దకు చేర్చారు.అలా వచ్చిన దండను వరుడు తీస్తున్న సమయంలో డ్రోన్ అక్కడే ఉన్న పూల మధ్యలో ఇరుక్కొని ఒక్కసారిగా క్రాష్ అయ్యింది.
అలా క్రాష్ అయిన డ్రోన్ పెళ్ళికొడుకు పక్కనే పడింది.నిజంగా దీంతో ఓ పెద్ద ప్రమాదమే తప్పిందని భావించవచ్చు.ఆ సమయంలో వారి పక్కన ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
ఈ సందర్భంలో తీసిన వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారంది.ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇందులో కొందరు వారి చిన్నతనంలో రిమోట్ కార్లను కూడా సరిగా ఆపరేట్ చేయనివాడు ప్రస్తుతం డ్రోన్ లతో డబ్బులు సంపాదించాలని పరిగెడుతున్నాడని కామెంట్ చేయగా.
మరికొందరు ఏదైనా చిన్న పొరపాటు జరిగి ఉంటే వధూవరులకు స్టేజి పైనే గాయాలు అయ్యేవని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి చూసేయండి.