కరీంనగర్ కదనభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై కేసీఆర్ మండిపడ్డారు.హోదాకు తగిన తీరులో ముఖ్యమంత్రి మాట తీరు లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రిని ఆరు గ్యారెంటీలు, కరెంటు మాయమైంది, నీళ్ళు ఎందుకు మాయమైపోతున్నాయి అంటే ఆయన నేను పండవోట్టి తొక్కుతా.పేగులు మెడలో వేసుకుంటా… పెండా ముఖానికి రాసుకుంటా.
చీరుత.చంపుతా.
మానవ బాంబునైత.మట్టి బాంబునైత.
అని మాట్లాడుతున్నాడు.ఇంత అసహనమా.? అంటూ మండిపడ్డారు.నేను ఉద్యమం సమయంలో మాట్లాడాను గాని పదేళ్ల సీఎం కాలంలో ఒక్కసారైనా నా నోటి నుంచి దురుసుమాటు విన్నారా.? అని ప్రశ్నించారు.
మా ప్రభుత్వం ఉన్న సమయంలో ఇంటింటికి మంచినీరు సరఫరా చేసాం.రెప్పపాటు కరెంటు కూడా తీయలేదు.మీరు ఇప్పుడు కాంగ్రెస్ ( Congress )కు ఓటు వేస్తే.
కరెంట్ ఇవ్వకపోయినా, రైతుబంధు లేకున్నా మళ్లీ ప్రజలు మాకే ఓటేశారు అంటారు.గ్యారెంటీలకు ఎగనామం పెడతారు.
ఈ టైములో వారికి మీరు కర్ర కాల్చి వాత పెట్టకపోతే అహంకారం పెరిగిపోతుంది అని కేసీఆర్( KCR ) కాంగ్రెస్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఎన్నో ఇబ్బందుల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.
ఆరోజు నాకున్న పదవులన్నీ విసిరి తెలంగాణ సాధించాలి అని భావించి సొంత రాష్ట్రం అయితే తప్ప.దిక్కు లేదని ఒక్కడిగా సైన్యంగా.
పిడికెడు మందితో జై తెలంగాణ అని బయలుదేరాం.ఆ రకంగా పోరాటాలు చేసే సమయంలో కరీంనగర్ జిల్లా ప్రజలు బ్రహ్మాండమైన పోరాటస్ఫూర్తితో ఉద్యమంలో రాణించారు.
కరీంనగర్ పోరాటాల గడ్డ… అంటూ కొనియాడారు.