ఇక తొందర్లోనే ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ప్లేయర్ కూడా వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జూన్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఐపీఎల్ లో ఎవరైతే బాగా ఆడతారో ఆ ప్లేయర్లను టీం లోకి తీసుకోవాలని బిసిసిఐ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే ప్రతి యంగ్ ప్లేయర్ కూడా ఈ మ్యాచ్ ల్లో వాళ్ళ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక అందులో భాగంగానే ప్రతి యంగ్ ప్లేయర్ టి20 వరల్డ్ కప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నారు.ఇక ఐపీఎల్ లో సత్తా చాటి వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రతి ఒక్క ప్లేయర్ కోరుకుంటున్నాడు.మరి ఇందులో ఎవరికి టీమ్ లో ఆడే అవకాశం లభిస్తుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పుడున్న యంగ్ ప్లేయర్లందరిలో ఎవరైతే ఐపీఎల్ లో బాగా ఆడుతారో ఆ ప్లేయర్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వెస్టిండీస్ లో ఎక్కువ మ్యాచ్ లు ఉండడం వల్ల అది స్లో పిచ్ ఆడడం వల్ల ఆ పిచ్ లను బేస్ చేసుకొని కూడా ప్లేయర్లను సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి…

ఇక టి 20 వరల్డ్ కప్( T20 World Cup ) మొదటి సీజన్ లో ఇండియన్ టీం కి కప్పు వచ్చింది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు రాకపోవడం నిజంగా చాలా బ్యాడ్ విషయం అనే చెప్పాలి.ఇక మనకు కప్పు వచ్చి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇంకా కూడా మన టీం ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు ఎప్పుడు ఏదో ఒక కారణం తో టోర్నీ నుంచి నిష్క్రమిస్తు వస్తుంది.
ఇక ధోని సారధ్యంలో వచ్చిన కప్పను మినహాయిస్తే ఇప్పటివరకు ఏకప్పు రాలేదు.గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ కు వచ్చి మిస్ చేసుకున్న ఇండియన్ టీమ్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టి20 వరల్డ్ కప్ ను మిస్ చేసుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
.






