Rohit Sharma : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ లో రోహిత్ శర్మను ఊరిస్తున్న ఐదు రికార్డులు ఇవే..!

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్ 2-1 లీడ్ లో ఉంది.ఈ సిరీస్ లో నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఝార్ఖండ్ లోని రాంచీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు జరగనుంది.

 These Are The Five Records That Rohit Sharma Is Making In The Fourth Test Again-TeluguStop.com

అయితే రాంచీ( Ranchi ) వేదికగా జరుగనున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma )ను ఏకంగా ఐదు రికార్డులు ఊరిస్తున్నాయి.అవి ఏమిటో చూద్దాం.

Telugu England, Fourth, Ranchi, Rohit Sharmam, India-Sports News క్రీడ

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) తన పదహారేళ్ల క్రికెట్ కెరియర్ లో టెస్టుల్లో ఇప్పటివరకు 3977 పరుగులు చేసి, నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరడానికి కేవలం 23 పరుగుల దూరంలో ఉన్నాడు.భారత జట్టు కెప్టెన్ గా 1000 పరుగుల మార్క్ చేరాలంటే మరో 70 పరుగులు చేయాల్సి ఉంది.

Telugu England, Fourth, Ranchi, Rohit Sharmam, India-Sports News క్రీడ

అంతేకాదు ఇంగ్లాండ్( England ) జట్టుపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి మరో 13 పరుగులు చేయాల్సి ఉంది.రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 593 సిక్సులు బాదాడు.మరో ఏడు సిక్సులు బాదితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సులు కొట్టిన ఘనత సాధిస్తాడు.రోహిత్ శర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేయడానికి మరో 37 పరుగులు చేయాల్సి ఉంది.

అంటే ఇంగ్లాండ్ తో జరిగే నాలుగవ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఏడు సిక్సులు బాదడంతోపాటు 70 పరుగులు చేస్తే ఏకంగా ఐదు సరికొత్త రికార్డులు సృష్టించబడతాయి.ఇక సిరీస్ విషయానికి వస్తే.

ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్లో ఓటమి చవిచూసిన భారత జట్టు రెండవ, మూడవ మ్యాచ్లలో ఇంగ్లాండును ఘోరంగా చిత్తు చేసింది.నాలుగవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ను ఓడించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

ఇంగ్లాండ్ జట్టు కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube