అంగన్వాడీలకు ఆదరణ కరువై...అద్దె భవనాలే శరణ్యం...!

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా హుజూర్ నగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న కోదాడ, మునగాల, నడిగూడెం,అనంతగిరి నాలుగు మండలాల్లో అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొన్ని,ప్రైమరీ స్కూళ్ళలో,మరి కొన్ని గ్రామపంచాయితీ ఆఫిస్, కమ్యూనిటీ భవనాల్లో అరకొర వసతుల నడుమ కొనసాగుతున్నాయి.ఈ నాలుగు మండలాల్లో మొత్తం 273 అంగన్వాడి సెంటర్లు ఉండగా అందులో 124 అద్దె భవనాల్లో,92 కమ్యూనిటీ, ఇతర భవనాల్లో నిర్వహిస్తుండగా 57 మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి.

 Lack Of Support For Anganwadis Rented Buildings Are A Refuge, Anganwadis , Anga-TeluguStop.com

సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో సరైన వసతులు లేక పిల్లలు ఉండే దగ్గరే వంట చేస్తూ ఉండడంతో పిల్లలు ప్రమాదకర సంఘటనలకు గురవుతున్నారు.

అద్దె భవనాల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

సెంటర్ కి వచ్చిన పసిపిల్లలకు ఉదయం టిఫిన్ చేపించి మధ్యాహ్నం నిద్రపుచ్చి ఇంటికి పంపిస్తున్నారు.కొన్నిచోట్ల పక్కా భవనాలు మంజూరైనా నిర్మాణం పూర్తి కాకుండా నిలిచిపోయాయి.ఇప్పటికైనా ఆదరణ కరువైన అంగన్వాడి కేంద్రాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి, ప్రతీ సెంటర్ కి పక్క భవనాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube