Dominos Pizza : డొమినోస్ పిజ్జాస్ తింటున్నారా.. ముందు ఈ వీడియో చూడండి..

డొమినోస్ పిజ్జాలు( Dominos Pizza ) ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే వీటిని ప్రజలు ఇష్టంగా తింటుంటారు.అయితే ఇకపై వాటిని తినడానికి ప్రజలు ఆలోచించొచ్చేమో! ఎందుకంటే తాజాగా జపాన్‌లోని( Japan ) డొమినోస్ పిజ్జా షాప్ నుంచి వచ్చిన ఓ వీడియో పిజ్జాలు అంటేనే అసహ్యం పుట్టించేలా చేసింది.

 Dominos Pizza : డొమినోస్ పిజ్జాస్ తింట-TeluguStop.com

ఆ వీడియో చాలా మందిని షాక్‌కు గురి చేసింది.వీడియోలో ఒక కార్మికుడు చాలా రోత పని చేస్తున్నట్లు చూపిస్తుంది.

అతను తన ముక్కులోని పొక్కును తీసి పిజ్జా పిండిపై దానిని ఉంచాడు.ఐదు నిమిషాలు చూస్తుంటేనే కడుపులో తిప్పేసింది వాంతి వస్తుంది ఏమో అనిపించింది.

ప్రజలు ఈ వీడియో చూశాక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కార్మికుడిని శిక్షించాలని కోరుతున్నారు.దీనిపై సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ మొదలయ్యింది.

జరిగిన దానికి చింతిస్తున్నామని డొమినోస్ చెప్పారు.షాప్ మూసివేసి ఆ పిజ్జా షాప్ నుంచి ఎవరూ ఏమీ తినకపోవడంతో కార్మికుడు ఈ పని చేశాడని వారు తెలిపారు.కార్మికుడు హ్యోగో ప్రిఫెక్చర్‌లోని అమగాసాకి సిటీ( Amagasaki City ) దుకాణంలో పార్ట్‌టైమ్ ఉద్యోగి.వారి నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటామని డొమినోస్( Dominos ) తెలిపింది.

ఆయనపై కేసు పెడతామని కూడా స్పష్టం చేసింది.జరిగిన దానికి తాము బాధగా ఉన్నామని డొమినోస్ నిర్వాహకులు తెలిపారు.

మళ్లీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

వారు తమ వినియోగదారులకు క్షమాపణలు కూడా చెప్పారు, తాము పరిశుభ్రత ఉన్నత ప్రమాణాలను అనుసరిస్తామని అన్నారు.డొమినోస్‌కి పరిశుభ్రత సమస్య రావడం ఇదే మొదటిసారి కాదు.ఇంతకు ముందు, బెంగళూరులోని డొమినోస్ షాప్ ఫోటో పిజ్జా పిండి ట్రేల పైన ఏవో క్లీనింగ్ టూల్స్ కనిపించాయి.

ఆ టూల్స్ కి అంటుకున్న మురికి సూక్ష్మ క్రిములు వల్ల తినేవారికి రోగాలు ఇచ్చే ప్రమాదం ఉంది.అయితే తమ కార్యకలాపాల్లో ఎలాంటి పొరపాట్లను తాము అంగీకరించబోమని, దీనిపై విచారణ జరుపుతామని డొమినోస్‌ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube