Madhopatti : ఆ గ్రామంలో మొత్తం 75 ఇళ్లు.. 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు.. ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలిచే ఈ ఊరు ఎక్కడంటే?

సాధారణంగా ఏదైనా గ్రామంలో ఐఏఎస్ లేదా ఐపీఎస్( IAS or IPS ) ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారనే ప్రశ్నకు మెజారిటీ గ్రామాలలో ఒక్కరు కూడా ఉండరనే సమాధానం వినిపిస్తుంది.ఐఏఎస్, ఐపీఎస్ కావడం సులువైన విషయం కాదు.

 Interesting And Shocking Facts About Janurpur Madhopatti Details Here Goes Vira-TeluguStop.com

అయితే ఒక గ్రామంలో మాత్రం 75 ఇళ్లు ఉండగా ఆ గ్రామంలో ఏకంగా 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం గమనార్హం.ఆ ఊరిని నెటిజన్లు ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు.

యూపీలోని జౌన్ పూర్ జిల్లాలోని మాధోపట్టి ( Madhopatti )ఈ గ్రామం పేరు కాగా లక్నోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది.పండుగలు వస్తే చాలు ఈ గ్రామం ఖరీదైన లగ్జరీ కార్లతో కళకళలాడుతుంది.

ఒక గ్రామంలో 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండటం అంటే అరుదైన రికార్డ్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Jaunpur, Madhopatti-Inspirational Storys

ప్రతి సంవత్సరం ఈ గ్రామం నుంచి సింగిల్ డిజిట్ లో విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతూ దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు.పెద్దపెద్ద నగరాలకు సైతం సాధ్యం కాని ఘనత ఈ గ్రామానికి సొంతమైందంటే ఈ గ్రామంలో ఏదో ప్రత్యేకత ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేని ఈ గ్రామం ఎన్నో గ్రామాలకు స్పూర్తిగా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు.

Telugu Jaunpur, Madhopatti-Inspirational Storys

దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఈ గ్రామంలోని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సేవలు అందిస్తున్నారు.పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ లను చేస్తున్న ఈ గ్రామస్తులను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.మాధోపట్టి గ్రామానికి సంబంధించిన విషయాలు, విశేషాల గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.రాబోయే రోజుల్లో ఈ గ్రామం మరింత మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫర్లను అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చాలని ఆశిద్దాం.

ఈ గ్రామం ఆదర్శ గ్రామం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube