టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
కాగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ప్రస్తుతం డార్లింగ్ చేతిలో రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి( Rajasaab, Spirit, Salar 2, Kalki ) లాంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్.
గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్.ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ప్రభాస్ జాతకం గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ప్రతిసారి ప్రభాస్ గురించి నెగటివ్ గానే ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు వేణు స్వామి( venu swamy ).ప్రభాస్ జాతకం బాగోలేదని ఎలాంటి సినిమా నటించినా ఫ్లాప్ అవుతుంది అంటూ సంచలన వాఖ్యలు చేశారు.తాజాగా కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వేణి స్వామి.
బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు చేసినా సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయిన రెబెల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.వైల్డ్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది.తద్వారా ప్రభాస్‌కు చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్‌ను ఈ సినిమా అందించింది.
పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న ప్రభాస్ జాతకం ఆ మధ్య హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.
దీనికి కారణం ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి అతడి జాతకంలో లోపాలు ఉన్నాయని, సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయని చెప్పడమే.అలాగే ప్రభాస్ ఆరోగ్యంపైన కూడా కామెంట్స్ చేశారు.ఇప్పుడు మరోసారి ఆయన దీనిపై మాట్లాడారు.
గతంలో ప్రభాస్ జాతకంలో లోపాలు ఉన్నాయని చెప్పి షాకిచ్చిన వేణు స్వామి.తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ.నా పాత వీడియోలు చూడండి.
ఆదిపురుష్ ఫ్లాప్ అని చెప్పినట్లు అయింది.సలార్ ఫ్యాన్స్ తప్ప ఎవరూ చూడరు అన్నాను.
ఆ సినిమా కూడా అలాగే ఉంది.అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదే ఇంటర్వ్యూలో వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.ప్రభాస్ సినిమాల విషయంలో నేను చెప్పినట్లే జరిగింది.
భారతదేశంలోనే నాలాంటి మగాడు లేడు.ఇప్పుడు కూడా చెబుతున్నాను.
ప్రభాస్ జాతకం అసలు ఏమాత్రం బాలేదు అంటూ స్పష్టం చేశారు.దీంతో వేణు స్వామి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల సలార్ సినిమా విషయంలో వేణు స్వామి చెప్పిన వాక్యాలు అబద్ధం కావడంతో ప్రభాస్ అభిమానులు రేంజ్ లో రుచుకు పడడంతో పాటు ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.