తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం జరిగిందని హరీశ్ రావు తెలిపారు.కేఆర్ఎంబీ సమావేశంలోనే ప్రాజెక్టులను ప్రభుత్వం అప్పజెప్పిందని ఆరోపించారు.
15 ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగిస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిపారు.నెల రోజుల్లో ప్రాజెక్టులను అప్పగిస్తామని సమావేశంలో అంగీకరిచారన్న ఆయన ప్రభుత్వం అంగీకరించినట్లు మీటింగ్ మినిట్స్ లో ఉందన్నారు.
తాము ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించిన తరువాతే ఢిల్లీకి లేఖ రాశారని తెలిపారు.ప్రాజెక్టులను అప్పగించింది నిజం కాకపోతే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
పదేళ్లలో కేసీఆర్( KCR ) ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదన్న హరీశ్ రావు వారి తప్పును కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం ఉండేది ప్రజల కోసమని, రాజకీయాల కోసమని తెలిపారు.ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమది ప్రజాపక్షమేనని స్పష్టం చేశారు.
.