ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉన్న వాళ్లకి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళని ఎవరూ పట్టించుకోరు.అందుకే ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని చాలా కష్టపడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరో గా వెలుగుంది ఇప్పుడు అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్న చాలామంది నటులు ఇండస్ట్రీలో ఉన్నారు.
వాళ్లు వాళ్ళ కెరియర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే వాళ్ళ మార్కెట్ అనేది కోల్పోవాల్సి వచ్చింది ఇక దానివల్లే వాళ్లకి అవకాశాలు రావడం లేదంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక ఈ లిస్ట్ లో రాజ్ తరుణ్( Raj Tarun ) మొదటి వరుసలో ఉంటాడు.ఇక అతనితో పాటుగా కిరణ్ అబ్బవరం, అల్లరి నరేష్, ఆది సాయి కుమార్ ( Kiran Abbavaram, Allari Naresh, Adi Sai Kumar )లాంటి హీరోలు కూడా క్రమక్రమంగా వాళ్ళ మార్కెట్ ని కోల్పోతూ వస్తున్నారు.
మరి ఇలాంటి సమయంలో వాళ్లు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాలంటే మంచి సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ వరుసగా రెండు, మూడు సక్సెస్ లను కొడితే తప్ప వాళ్ళని ప్రేక్షకులు గుర్తుంచుకునే పరిస్థితి అయితే లేదు.
ఎందుకంటే రోజురోజుకీ కొత్త ఆర్టిస్టులు వస్తూ వాళ్ల టాలెంట్ ని చూపించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళు ఇంకా లేట్ చేస్తున్నకొద్దీ వీళ్లని జనాలు మర్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.అలాగే జనాలను మెప్పించే కాన్సెప్ట్ లతో సినిమాలు చేయాలి కానీ ఏది పడితే అది చేస్తే సినిమా ఆడదు దానివల్ల వాళ్ళ కెరియర్ అనేది డైలమా లో పడుతుంది అనేది వాస్తవం…మరి ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెడితే మంచింది…లేకపోతే ఇక వాళ్ళు ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే…
.