పండుగ దృష్ట్యా రహదారిపై రక్షణ చర్యలు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది,కావున జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 65 పై ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా జిల్లా పోలీసు నివారణ చర్యలు చేపట్టడం జరిగినదని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడుతూ వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని,అతివేగంతో వాహనాలు నడవద్దని, నిద్ర మత్తులో వాహనాలు నడపవద్దని,దూర ప్రయాణం వల్ల అలసిపోవడం,నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలకు జరిగే అవకాశం ఉన్నదని,

 Safety Measures On Roads In View Of Festival District Sp Rahul Hegde, Safety Mea-TeluguStop.com

అందుకే ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వాహనాలు కండిషన్ లో ఉండాలని, చలి ప్రభావం,పొగమంచు ఉంటుంది కాబట్టి రాత్రి ప్రయాణంలో డ్రైవర్ అప్రమత్తత అవసరమని చెప్పారు.అత్యవసర సమయంలో రహదారుల అధికారులను లేదా డయల్ 100 కు పొన్ చేసి సహాయం పొందాలని, రోడ్డు ప్రక్కన అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దని విజ్ఞప్తి చేశారు.

భారీ వాహనాలు ఒక క్రమంలో వెళ్ళాలని,ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు.ముఖ్యంగా జాతీయ రహదారి వెంట గల సూర్యాపేట రూరల్, చివ్వెంల,మునగాల, కోదాడ మండలాల పరిధిలో గల గ్రామాల రైతులు, ప్రజలు

వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు మార్గంలో వాహనాలు,పశువులను తీసుకువెళ్లడం ప్రమాదమని గమనించాలని అన్నారు.

సిబ్బంది రోడ్లపై గస్తీ నిర్వహించాలని,పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.తప్పుడు మార్గంలో వాహనాలు నడిపినా,రోడ్లపై న్యూసెన్స్ చేసినా,ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపితే కేసులు నమోదు చేయాలన్నారు.

నిత్యం వాహనాలు తనిఖీలు చేస్తూ మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్,రాంగ్ రూట్ డ్రైవింగ్,ఓవర్ లోడింగ్ నిరోధించాలని సిబ్బందిని దిశానిర్దేశం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube