టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ మ్యాన్ గా పేరుగాంచిన రాజశేఖర్ ( Rajashekhar) ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేశారు.అయితే అలాంటి రాజశేఖర్ ఈమధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.
దానికి ప్రధాన కారణం ఈయన చేసిన సినిమాలు హిట్ అవ్వకపోవడం, అంతేకాకుండా దర్శక నిర్మాతలు ఎవరు ఈయనకు హీరోగా అవకాశాలు ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో చేయాల్సి వస్తుంది.ఇక రీసెంట్ గా ఈయన నితిన్ హీరోగా చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra Ordinary man ) అనే సినిమాతో మన ముందుకు వచ్చారు.
అయితే అలాంటి రాజశేఖర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఫుల్లుగా మందు తాగి శివాలయానికి వెళ్లాను అంటూ ఒక సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు.
![Telugu Extra Ordinary, Jeevitha, Nithiin, Rajashekhar, Shivani, Shivathmika, Van Telugu Extra Ordinary, Jeevitha, Nithiin, Rajashekhar, Shivani, Shivathmika, Van](https://telugustop.com/wp-content/uploads/2023/12/Rajashekhar-tollywood-social-media-Vandematharam-Extra-Ordinary-man-movie.jpg)
ఇక అసలు విషయంలోకి వెళ్తే.వందేమాతరం ( Vandematharam ) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ సినిమాల్లోకి రాకముందే డాక్టర్.తండ్రి కోరిక మేరకు కొన్ని రోజులు డాక్టర్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఈయన జీవితను పెళ్లి చేసుకొని శివాత్మిక, శివాని అనే ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చారు.ప్రస్తుతం వీళ్లు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు.అయితే రాజశేఖర్ జీవితను ప్రేమించి పెళ్లి చేసుకోక ముందే మరో అమ్మాయిని ప్రేమించారట.అయితే ఆ అమ్మాయి తన ప్రేమను యాక్సెప్ట్ చేయడం లేదని ఓ రోజు బాగా తాగి బాధలో మునిగిపోయారట.
ఇక అలా తాగుతున్న సమయంలో రాజశేఖర్ స్నేహితుడు వచ్చి నువ్వు ఆ శివాలయానికి వెళ్లి నీ మనసులో ఉన్న కోరిక కోరుకున్నావంటే కచ్చితంగా అది నెరవేరుతుంది అని చెప్పారట.అయితే ఈ విషయంలో అంతగా నమ్మకం లేని రాజశేఖర్ తన ఫ్రెండ్ చెప్పడంతో ఫుల్ గా తాగి అలాగే శివాలయానికి వెళ్లారట.
![Telugu Extra Ordinary, Jeevitha, Nithiin, Rajashekhar, Shivani, Shivathmika, Van Telugu Extra Ordinary, Jeevitha, Nithiin, Rajashekhar, Shivani, Shivathmika, Van](https://telugustop.com/wp-content/uploads/2023/12/Rajashekhar-tollywood-social-media-Vandematharam-Extra-Ordinary-man.jpg)
ఇక అక్కడికి వెళ్లి దేవుడికి తన మనసులో ఉన్న కోరికని చెప్పి ఈ కోరిక నెరవేరితేనే నువ్వు దేవుడు లేకపోతే రాయివని నమ్ముతానని అక్కడి నుండి వచ్చేసారట.ఇక ఆ తర్వాత రెండు రోజులకే ఆయన కోరుకున్న కోరిక నెరవేరిందట.ఆ అమ్మాయి రాజశేఖర్ ( Rajashekhar ) ప్రేమని యాక్సెప్ట్ చేసిందని రాజశేఖర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఈ విషయం మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో మందు తాగి గుడికి వెళ్ళడం ఏంటి అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.