రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) డైరెక్షన్ లో తెరకెక్కిన వ్యూహం సినిమా( Vyuham Movie ) మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకున్నా వేర్వేరు వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా ఈ సినిమా వార్తల్లో నిలిచింది.
ఏపీలోని అధికార పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించానని ఇప్పటికే వర్మ పలు సందర్భాల్లో వెల్లడించారు.వైసీపీకి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలను తెరకెక్కించడం ఇదే తొలిసారి కాదు.

ఒక వ్యక్తి ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఆర్జీవీ తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటన చేయగా ఆ ప్రకటన విషయంలో వర్మ ఘాటుగా స్పందించడంతో పాటు ఏపీ డీజీపీని కలిసి తనకు రక్షణ కల్పించాలని లేఖ రాశారు.ఈ వ్యవహారం గురించి నాగబాబు స్పందిస్తూ వర్మ గారు భయపడాల్సిన అవసరం లేదని వర్మ జీవితానికి ఏ ఢోకా లేదని వర్మ ప్రాణాలకు ఎలాంటి అపాయం వాటిల్లదని నేను మాటిస్తున్నానని పేర్కొన్నారు.ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకు ఎలాంటి హాని తలపెట్టడని నాగబాబు వెల్లడించారు.

హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ ను ఎవరూ చంపరని నాగబాబు అభిప్రాయపడ్డారు.ఆర్జీవీ ఎలాంటి బెంగ లేకుండా ఓడ్కా వేసుకుని పడుకోవాలని నాగబాబు సలహా ఇచ్చారు.అయితే వర్మ చేసిన కామెంట్లకు నాగబాబు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.“సర్.నాకంటే పెద్ద కమెడియన్ ఎవరంటే నా సినిమాలో మీరు” అంటూ రివర్స్ లో పంచ్ వేశారు.
నాగబాబు( Naga Babu ) ఆర్జీవీ మధ్య మాటల యుద్ధం మొదలు కాగా ఈ మాటల యుద్ధం ఎంతవరకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.ఆర్జీవీ వ్యూహం సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.







