యువ హీరో అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.ఈ మధ్యనే చైతూ మరో సినిమాను స్టార్ట్ చేసాడు.
నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న చందు మొండేటి నాగ చైతన్యకు కూడా హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమాకు ‘తండేల్”( Thandel ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసారు.
ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి ( Sai Pallavi ) నటిస్తుంది.లవ్ స్టోరీ సినిమాతో ఆకట్టుకున్న ఈ జోడీ మరోసారి అలరించేందుకు సిద్ధం అయింది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఇచ్చారు.
ఈ సినిమా షూట్ ను సముద్రం మధ్యలో స్టార్ట్ చేసినట్టు తెలిపారు.అంతేకాదు చైతూ ఎనర్జిటిక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు.రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చారు.మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ కు ఈ అప్డేట్ తో ఫుల్ కిక్ ఇచ్చారు.
కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మిస్తున్నారు.చూడాలి ఈ కాంబో ఎలా ఆకట్టుకుంటుందో.