భారతీయ సంతతికి చెందిన చాలామంది ప్రజలు ఇతర దేశాల్లో ఉన్నత స్థానాలను చేజిక్కించుకుంటూ గర్వకారణంగా నిలుస్తున్నారు.తాజాగా మరొక ఎన్నారై వ్యక్తి యూకేలోని( UK ) ప్రతిష్టాత్మకమైన హోదా దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
యూకే ప్రభుత్వం బీబీసీ( BBC ) కొత్త ఛైర్మన్‌గా అనుభవజ్ఞుడైన టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ సమీర్ షాను( Samir Shah ) నామినేట్ చేసింది.పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపితే చాలు భారతీయ సంతతికి సమీర్ షా అఫీషియల్‌గా ఈ పగ్గాలను చేపడతారు.
ఏప్రిల్‌లో మునుపటి ఛైర్మన్ రిచర్డ్ షార్ప్( Richard Sharp ) రాజీనామా చేశాక ప్రభుత్వం ఆ పదవిని ఎన్నారైతో భర్తీ చేస్తోంది.గతంలో యూకే మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు లోన్ ఇవ్వడంలో ప్రమేయం ఉందని మాజీ ఛైర్మన్‌పై ఆరోపణలు వెళ్లి వచ్చాయి.
ఆ తర్వాత ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

సమీర్ షా 1979లో లండన్ వీకెండ్ టెలివిజన్‌లో తన కెరీర్ స్టార్ట్ చేశారు.అప్పటి నుంచి బీబీసీలో కరెంట్ అఫైర్స్ హెడ్, పొలిటికల్ జర్నలిజం పర్యవేక్షణతో సహా ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నారు.బీబీసీ 500 మిలియన్ పౌండ్లు ఆదా చేయడానికి ప్రయత్నిస్తోన్న నేపథ్యంలో ఎన్నారై సమీర్( NRI Samir Shah ) నియామకం జరుగుతోంది.
ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా బీబీసీ సంస్థ ఇటీవల తన “న్యూస్‌నైట్” ( Newsnight ) కార్యక్రమాన్ని తగ్గించింది.

71 ఏళ్ళ వయసులో, షా బీబీసీ లైసెన్స్ ఫీజును పెంచడం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు.ఇదే ఆ సంస్థకు ప్రధాన నిధుల వనరు.ఏదేమైనప్పటికీ, ప్రతి గృహానికి ప్రస్తుత ఫీజు 159 పౌండ్లకి అదనంగా మరో 9% పెంపును ప్రధాన మంత్రి రిషి సునాక్( PM Rishi Sunak ) తిరస్కరించే ఛాన్స్ ఉంది.
షా టెలివిజన్ రంగంలో 40 ఏళ్ల అనుభవం ఉంది.ప్రభుత్వం ఎంపిక చేసిన అభ్యర్థిగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.బీబీసీ ఎంపికను స్వాగతించింది.అధికారిక నియామక ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు.