ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను మరొకసారి థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు.
సూపర్ హిట్ సినిమాలను మాత్రమే కాకుండా ఫ్లాప్ సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు.కానీ మూవీ మేకర్స్ ఆశించిన స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రావడం లేదు.
ఆ సినిమాలో ఇదివరకే చూశారు అన్న కారణమా లేక మరేంటో తెలియదు కానీ ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సినిమా థియేటర్లకు రావడం లేదు.ఒకప్పుడు కోట్లలో కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాలను థియేటర్లో రిలీజ్ చేయగా దారుణంగా వేలలో కలెక్షన్స్ ను రాబడుతున్నాయి.
పాత సినిమా రైట్స్‌ను తీసుకొని దాన్ని 4కె ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసి మంచి క్వాలిటీతో థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు.అయితే మొదట్లో రీ రిలీజ్ ( ( Re release ) )అయిన సినిమాలను ప్రేక్షకులు కూడా ఎగబడి చూసారు.కానీ ఆయా హీరోల అభిమానులకు సైతం రొటీన్‌లా అనిపిస్తోంది.కొన్ని సినిమాలు డిజిటల్ మీడియాలో అందుబాటులో ఉండడమే దానికి కారణం.మొదట్లో రీరిలీజ్‌కి లభించిన ఆదరణ చూసి ఏ సినిమా అయినా రిలీజ్ చేసెయ్యొచ్చు అని భావించడం వల్లే ఇప్పుడు ఆదరణ తగ్గింది.కొన్ని సినిమాలు థియేటర్‌లో చూస్తేనే థ్రిల్ ఉంటుంది.
చిన్న స్క్రీన్ మీద ఆ ఎఫెక్ట్ రాదు అనుకునే సినిమాలైతేనే థియేటర్స్‌లో చూస్తారు.ఇది గ్రహించని కొందరు తమకు అందుబాటులో ఉన్న సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు.
కాగా ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ సినిమా( NTR ) అదుర్స్.( Adurs movie ) ఈ సినిమా ట్రైలర్‌ను చాలా థియేటర్స్‌లో ప్రదర్శించారు.కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్‌లో జనం లేరు.దీన్ని బట్టి రీ రిలీజ్ అనే కాన్సెప్ట్‌కి కాలం చెల్లినట్టే అనిపిస్తోంది.థియేటర్స్‌లో ప్రేక్షకులు లేకపోతే ప్రస్తుతం ఆయా హీరోలు చేస్తున్న సినిమాలపై కూడా ఆ ప్రభావం ఉండకపోదు. అదుర్స్ మూవీకి కలెక్షన్స్ రాకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది.ఇకపై తమ సినిమాలు రీరిలీజ్ చెయ్యకుండా నిరోధిస్తే బాగుంటుందని కొందరు హీరోలు డిసైడ్ అయ్యారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అలాగే రీ రిలీజ్ సినిమాలకు వస్తున్న కలెక్షన్లను చూసి మూవీ మేకర్స్ కూడా షాక్ అవుతున్నారు.ఎన్టీఆర్ సినిమాలకే అలాంటి పరిస్థితి ఉంటే మరి మిగతా హీరోల సినిమాల పరిస్థితి ఏంటో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వర్గం ప్రేక్షకులు అయితే అదుర్స్ సినిమాతో అయినా కాస్త బుద్ధి తెచ్చుకొని ఇకమీదట అయినా ఆ సినిమాలను రీ రిలీజ్( Re release ) చేయకపోవడమే మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.