ప్రస్తుతం ఎన్నికల బీజేపీ ( BJP ) డెడ్ స్లో అయిన సంగతి తెలిసిందే.గత ఆర్నెళ్ళ ముందు అధికార రేస్ లో కాంగ్రెస్ ( Congress ) కంటే ముందున్న కమలం పార్టీ.
సరిగ్గా ఎన్నికల ముందు ఘోరంగా తడబడుతూ ఎలక్షన్ రేస్ లో ఊహించని విధంగా వెనకబడింది.అంతే కాకుండా పార్టీ నుంచి కూడా కీలక నేతలు ఒక్కొక్కరుగా జరుకుంటున్నారు.
దీంతో సరిగ్గా ఎన్నికల సమయానికి కాషాయ పార్టీ ఖాళీ అయిన ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట.మరి ఈ స్థాయిలో బీజేపీ డౌన్ ఫాల్ కావడానికి కారణం బండి సంజయే( Bandi Sanjay ) అనేది ఆ పార్టీలో కూడా చాలమంది చెబుతున్నా మాట.బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో తనదైన రీతిలో పార్టీ ముందుండి నడిపించారు.తెలంగాణలో బీజేపీ బలపడడానికి మెయిన్ రీజన్ కూడా బండి సంజయే అనేది అందరికీ తెలిసిన విషయం.
![Telugu Amit Shah, Bandi Sanjay, Bjp Downfall, Congress, Etela Rajender, Kishan R Telugu Amit Shah, Bandi Sanjay, Bjp Downfall, Congress, Etela Rajender, Kishan R](https://telugustop.com/wp-content/uploads/2023/11/Has-BJP-lost-because-of-Bandi-Sanjay-detailss.jpg)
మరి అలాంటి బలమైన నేతను అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఎంటనేది గత కొన్నాళ్లుగా మిస్టరీగా ఉంటూ వచ్చింది.అయితే ఎన్నికల ముందు ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది.పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడూ బండి సంజయ్ చాలా అవినీతికి పాల్పడ్డారని, పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అందుకే అధ్యక్ష పదవి నుంచి తప్పించారని బీజేపీలోని ఒ వర్గం చెబుతున్నా మాట.ఇక అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాత పార్టీలో చాలమంది నేతలను తనవైపు తిప్పుకొని వ్యూహాత్మకంగా అంతర్గత కుమ్ములాటలను ప్రోత్సహిస్తూ పార్టీలో గందర గోళం సృష్టిస్తున్నారనే విమర్శ బండి సంజయ్ పై అడపా దడపా వినిపిస్తూనే వుంది.
![Telugu Amit Shah, Bandi Sanjay, Bjp Downfall, Congress, Etela Rajender, Kishan R Telugu Amit Shah, Bandi Sanjay, Bjp Downfall, Congress, Etela Rajender, Kishan R](https://telugustop.com/wp-content/uploads/2023/11/Has-BJP-lost-because-of-Bandi-Sanjay-detailsa.jpg)
అందుకే పార్టీలోని ఇతర నేతలతో బండి సంజయ్ సక్యతగా మెలగకపోవడం, మునుపటి యాక్టివ్ కనబరచకపోవడం వంటి వైఖరి అవలంభిస్తూ వచ్చారు.బండి సంజయ్ ఇలా వ్యవహరించడానికి కారణం.తెలంగాణ బీజేపీకి( Telangana BJP ) తానే దిక్కు అని అధిష్టానానికి తెలిసోచ్చేలా చేయడమే అనేది కొందరు విశ్లేషకుల నుంచి వస్తున్న అభిపాయం.ఇక ఇటీవల పార్టీ నుంచి బయటకు వస్తున్న వారు కూడా బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాతే బీజేపీ పాతాళానికి పడిపోయిందని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు.
మొత్తానికీ బీజేపీ డౌన్ ఫాల్ అంతా కూడా బండి సంజయ్ చుట్టూనే తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.