తెలంగాణలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పెద్ద కుంభకోణమని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు.ధరణి పోర్టల్ లో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు.
ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చారని ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు.ధరణి వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పారు.
వాట్సప్, మెయిల్ లో ధరణిపై బీజేపీకి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.ధరణి పేరుతో దొడ్డిదారిన భూములు కొల్లగొట్టారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ముమ్మాటికి భూ దందా సర్కార్ అని ఆరోపించారు.ధరణి తప్పులపై బీజేపీ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు.
ధరణి వ్యవహారంపై విచారణ జరగాల్సిందే డిమాండ్ చేశారు.భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.