మ్యాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్ ( Fake profile in matrimony )తో ఓ యువకుడు పెళ్లిళ్ల కోసం నమోదు చేసుకున్న మహిళలను టార్గెట్ చేసి మోసం చేయడం తన ప్రధాన వృత్తిగా ఎంచుకున్నాడు.అయితే హైదరాబాద్ పోలీసులకు చిక్కి చివరికి జైలు పాలు అయ్యాడు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.అవి ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.కందుకూరు మండలం నెడనూరు గ్రామానికి చెందిన తుమ్మ మోహన్ రెడ్డి( Tumma Mohan Reddy ) (38) అనే వ్యక్తికి కల్వకుర్తికి చెందిన మహిళతో 2011లో వివాహం జరిగింది.
అయితే గొడవల కారణంగా ఆమెతో దూరంగా ఉంటున్నాడు.తన పేరు మోహన్ రెడ్డి కాకుండా శ్రీనాథ్ అనే పేరును మ్యాట్రిమోనీలో పోదు చేసుకున్నాడు.
అయితే ఓ మహిళ విడాకులు తీసుకున్నాక రెండవ పెళ్లి చేసుకోవడం కోసం భారత్ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుంది.ఆ మహిళ ప్రొఫైల్ సేకరించి, ఫోన్ చేసి తాను పెళ్లి చేసుకుంటానని చాలా అమాయకంగా మాట్లాడాడు.
ఆ తర్వాత ఒకసారి నేరుగా కలిస్తే బాగుంటుంది అనడంతో ఆ అమ్మాయి అంగీకరించింది.అయితే వచ్చే సమయంలో నగలతో పాటు వస్తే ఫోటో తీసుకుని తన తల్లిదండ్రులకు చూపించి వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.ఆ మాటలు నిజం అని నమ్మిన మహిళ ఈనెల ఏడవ తేదీ సికింద్రాబాద్( Secunderabad ) కు వచ్చింది.ఆ యువతిని యాత్రి ఇన్ హోటల్ కు తీసుకువెళ్లి, ఫోటోలు దిగేముందు ఫ్రెష్ అప్ కావాలని చెప్పాడు.
దీంతో ఆ మహిళ వాష్ రూమ్ కు వెళ్ళింది.వెంటనే ఆమెకు చెందిన 27 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.పోలీసుల విచారణలో మోహన్ రెడ్డి shadhi.com లో గౌతమ్ రెడ్డి పేరు నమోదు చేసుకుని ఓ మహిళను నమ్మించి క్రెడిట్ కార్డు ద్వారా రూ.6.20 లక్షలతో బంగారు నగలు కొనుగోలు చేసి పరారయ్యాడు.మరో మ్యాట్రిమోనీలో విజయ రెడ్డి పేరుతో రూ.9లక్షలు తన అకౌంట్లో వేయించుకున్నాడు.చైతన్యపురిలో ఉండే ఓ హాస్టల్ లో రూ.40 వేల విలువచేసే ల్యాప్ టాప్ దొంగలించాడు.మాదాపూర్ లో ఉండే హాస్టల్లో రూ.70 వేల విలువచేసే ల్యాప్ టాప్ దొంగలించాడు.ఇలాంటి కేసులు ఇంకా చాలానే ఉన్నాయి.