బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.ముందు తెలిపిన ప్రకారం ఇవాళ రాత్రికి ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వలన అమిత్ షా రేపు హైదరాబాద్ కు రానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయని తెలుస్తోంది.ఈ మేరకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న ఆయన నేరుగా గద్వాలకు వెళ్లనున్నారు.
అక్కడ బీజేపీ నిర్వహిస్తున్న సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరుకానున్నారు.తరువాత మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ సభ, మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ లో నిర్వహించే సభలకు అమిత్ షా హాజరవుతారు.
సభలు ముగిసిన అనంతరం హైదరాబాద్ కు తిరిగి వస్తారు.ఈక్రమంలోనే రేపు సాయంత్రం బీజేపీ మ్యానిఫెస్టోను ఆయన ప్రకటించే అవకాశం ఉంది.