నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఇలా హీరోగా భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన తదుపరి సినిమా డైరెక్టర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా కూడా షూటింగ్ పనులను ప్రారంభించుకుంది.
ఇలా బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో చురుగ్గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే హిందూపురం( Hindupuram ) నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలయ్య తాజాగా హిందూపురంలో పర్యటించారు.
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) తో జనసేన పార్టీ( Janasena Party ) పొత్తు కుదుర్చుకున్న సంగతి మనకు తెలిసిందే.జనసేన, టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపురం వెళ్లారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ వేడుకలో ఈయన తెలుగుదేశం పార్టీ కండువాతో పాటు జనసేన పార్టీ కండువా కూడా తన మెడలో వేసుకొని కనిపించడం విశేషం.
ఇక పవన్ కళ్యాణ్ గురించి బాలయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేను ఇద్దరు కూడా ఒకే వ్యక్తిత్వం కలవారని బాలకృష్ణ తెలిపారు.మా ఇద్దరిలో ఒకే విధమైనటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి.
ఇద్దరం కూడా ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం మాకు ఇవ్వండి అలాగే ఎవరికి భయపడము అవినీతి అరాచక పాలనకు పాల్పడే వారిని లెక్క చేయకపోవడం వంటి లక్షణాలు పవన్ కళ్యాణ్ లోను నాలోను ఇద్దరిలోనూ ఉన్నాయి అంటూ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా మెగా నందమూరి హీరోలు ఇద్దరినీ కూడా ఒకే చోట చూడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈసారి కూడా హిందూపురంలో విజయం సాధించడం కోసమే బాలయ్య ఇప్పటినుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారని స్పష్టంగా అర్థం అవుతుంది.