నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకెపి కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం( Grain ) వర్షపు నీటితో తడిసి,కొన్నిచోట్ల కొట్టుకు పోవడంతో చేతికందిన పంట చేజారి అన్నదాత తీవ్ర అవస్థలు పడ్డారు.రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం ఇంటిల్లిపాది చెమటోడిచి పండించిన పంట తీరా కళ్ళంలో పోసి అమ్మే సమయానికి ప్రకృతి ప్రకోపానికి బలైపోతుందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి( heavy rain ) కళ్ళాలలో,రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవ్వడంతో రైతన్నల ఆశలు ఆవిరైపోయాయి.