భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.మ్యాచ్ అన్నాక గెలుపు ఓటములు సహజం.
కానీ ఏ పెద్ద జట్టు కూడా పసికూన జట్ల చేతుల్లో ఓటమిని కోరుకోదు.చివరి వరకు పోరాడి పసికూన జట్లపై పై చేయి సాధించాలని పెద్ద జట్లు కోరుకుంటాయి.
కానీ పసికూన జట్లు పటిష్ఠమైన జట్లను ఓడిస్తూ చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నాయి.ఈ టోర్నీలో( tournament ) టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొన్ని జట్లు వరుస ఓటములతో సతమతమవుతూ సెమీస్ చేరే అవకాశాలను చేజార్చుకుంటున్నాయి.
ఈ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆరంభంలో అద్భుతమైన విజయాలను సాధించింది.ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమవుతూ సెమీస్ చేరే అవకాశాలను దూరం చేసుకుంటుంది.
ఈ టోర్నీలో పాకిస్తాన్ ( Pakistan )జట్టుకు అత్యంత కీలకమైన మ్యాచ్ ఏదంటే సౌత్ ఆఫ్రికా జట్టుతో( South African team ) ఆడిన మ్యాచ్.సౌత్ ఆఫ్రికా పై గెలిచి ఉంటే పాకిస్తాన్ సెమీస్ చేరే ఆశలు సజీవంగా ఉండేవి.కానీ ఒక్క వికెట్ తేడాతో ఓడిన పాకిస్తాన్ కు సెమీస్ చేరే దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే.ప్రపంచ కప్ చరిత్రలో ఒక్క వికెట్ తేడాతో జట్లు విజయం సాధించడం చాలా అరుదు.
ఇలా ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన జట్లు ఏవో చూద్దాం.ప్రపంచ కప్ చరిత్రలో ఏడుసార్లు ఒక వికెట్ తేడాతో వివిధ జట్లు గెలిచాయి.తాజాగా సౌత్ ఆఫ్రికా జట్టు, పాకిస్తాన్ జట్టుపై ఒక వికెట్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.1975 లో పాకిస్తాన్ పై వెస్టిండీస్ జట్టు, 1987లో వెస్టిండీస్ పై పాకిస్తాన్ జట్టు, 2007లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా జట్టు, 2007లో వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ జట్టు, 2015లో స్కాట్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు, 2015లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించడం జరిగింది.