ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.
‘ మా దగ్గర మంచి షూటర్లు ఉన్నారు.రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’ అంటూ ఆగంతుకులు బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇంఛార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన ముంబై గామ్ దేవీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.విచారణలో భాగంగా షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు గుర్తించారు.
అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇటువంటి తరహా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్ కిసాన్ దాస్ ఆస్పత్రికి బెదిరింపు కాల్ వచ్చింది.ఆస్పత్రిని పేల్చడంతో పాటు అంబానీ కుటుంబాన్ని కూడా చంపేస్తామని నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.







