చలికాలం( Winter Season ) రానే వచ్చింది.ఈ సీజన్ లో చర్మ సంబంధిత సమస్యలు ప్రధానంగా వేధిస్తుంటాయి.
ముఖ్యంగా చర్మం తరచూ పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంటుంది.ఇటువంటి చర్మాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు లోలోన తెగ మదన పడుతూ ఉంటారు.
ఎలా మళ్లీ చర్మాన్ని అందంగా మెరిపించుకోవాలో అర్థం కాక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ వర్రీ వద్దు.
ఇంట్లోనే ఈజీగా అటువంటి చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా చిన్న కీరా దోసకాయ( Cucumber )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ కీర దోసకాయ తురుము వేసుకోవాలి.వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ పెరుగు, మూడు టేబుల్ స్పూన్లు పాలు( Milk ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ హోమ్ రెమెడీ( Home Remedy )ని పాటిస్తే.చర్మం ఆరోగ్యంగా మారుతుంది.అలాగే ఈ ప్యాక్ చర్మానికి అవసరమయ్యే తేమను అందిస్తుంది.స్కిన్ డ్రై అవ్వకుండా రక్షిస్తుంది.నిర్జీవంగా ఉన్న చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మెరిపిస్తుంది.చర్మంపై మరికి, మృత కణాలు ఉంటే తొలగిపోతాయి.
కాబట్టి చలికాలంలో చర్మాన్ని అందంగా, మృదువుగా మరియు ప్రకాశవంతంగా మెరిపించుకోవాలని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పిన హోమ్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.