ఉలవలు( Horse Gram ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
నవధాన్యాల్లో ఒకటైన ఉలవలను పురాతన కాలం నుంచి వాడుతున్నారు.ధరతో పాటు ఉలవల్లో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
ఉలవలను ఉడికించి తీసుకోవచ్చు.అలాగే కొందరు ఉలవలతో చారు తయారు చేసుకుని ఇష్టంగా తీసుకుంటారు.
చాలా మందికి ఉలవచారు ఫేవరెట్ రెసిపీగా చెప్పుకోవచ్చు.ఇక ఆరోగ్య పరంగా ఉలవలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
ముఖ్యంగా మహిళలకు ఎంతో మేలు చేస్తాయి.

సాధారణంగా ఎక్కువ శాతం మహిళలు ఇంటి పనులు, వంట పనులు చేస్తూ భర్త పిల్లలను చూసుకుంటూ ఉంటారు.అలాగే ఉద్యోగం కూడా చేస్తుంటారు.ఈ క్రమంలోనే తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తారు.
దాంతో చిన్న వయసులోనే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.అందుకే ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.
డైట్ లో పోషకాహారాన్ని చేర్చుకోవాలి.ముఖ్యంగా ఉడికించిన ఉలవలను మహిళలు ప్రతి రోజు తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.
ఉలవల్లో ఉండే ప్రోటీన్ ఎక్కువ సమయం పాటు ఎనర్జిటిక్ గా ఉండేందుకు సహాయపడుతుంది.మహిళల్లో తరచూ తలెత్తే రక్తహీనతకు ఉలవలు చెక్ పెడతాయి.
అలాగే ఉడికించిన ఉలవలను తీసుకోవడం వల్ల నెలసరి రాకపోవడం, క్రమం తప్పడం వంటి ఋతు సంబంధ సమస్యలు దూరం అవుతాయి.

చాలా మంది మహిళలు నడుము నొప్పితో( Back pain ) తరచూ బాధపడుతుంటారు.అయితే ఉలవలను ఆహారంలో భాగం చేసుకుంటే అందులో ఉండే కాల్షియం, విటమిన్ కె ఇతర పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.దాంతో నడుము నొప్పే కాదు అన్ని నొప్పులు పరార్ అవుతాయి.
ఇక మహిళలు ఉలవలను ఆహారంలో భాగం చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
మధుమేహం, ( Diabetes )గుండె సంబంధిత జబ్బులు దరిచేరకుండా సైతం ఉంటాయి.







