మానవ శరీరంలోని ప్రధాన అవయవాలలో మెదడు( Brain ) ముఖ్యమైనది అని దాదాపు చాలా మందికి తెలుసు.మనిషి శరీరా, మానసిక పనులు అన్ని దీని ఆధీనంలో ఉంటాయి.
అందుకే మెదడు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం.కానీ ప్రస్తుత రోజులలో కొన్ని చెడు అలవాట్లు మెదడును బలహీనపరుస్తున్నాయి.
దీని వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.ఈ అలవాటులను మార్చుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది.
అయితే మెదడుకి హాని కలిగించే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మెదడు సరిగ్గా పని చేయడానికి నిద్ర ఎంతో అవసరం.

తగినంత నిద్ర( Sleep ) లేకపోతే మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది.ఇది జ్ఞాపకశక్తిని కూడా తగ్గిస్తుంది.అలాగే ఏకాగ్రత సమర్ధాన్ని కూడా తగ్గిస్తుంది.ఇంకా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారం మెదడుకు ఎంతో అవసరం.అధికంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్( Alcohol ), కేఫిన్ తీసుకుంటే అది మెదడుకు హాని చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ధూమపానం( Smoking ), మెదడు కణాలను దెబ్బతీస్తుంది.
ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రత సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడులో మంట వస్తుంది.
ఇది జ్ఞాపక శక్తి, ఏకాగ్రత సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

ఒత్తిడి మెదడు లో ఒక రకమైన హార్మోన్లను( Hormones ) ఉత్పత్తి చేస్తుంది.ఇది మెదడు కణజాలాలను దెబ్బతీస్తుంది.ఇంకా చెప్పాలంటే వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది.
కొత్త న్యూరాన్ల ఏర్పాటును ఏర్పాట్లు ప్రోత్సహిస్తుంది.క్రమం తప్పకుండా వ్యాయామం( Exercise ) చేయకపోవడం వల్ల మెదడు ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే పై కారణాల వల్ల మెదడు బలహీనపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే వీటికి సంబంధించిన ఏవైనా మందులు లేదా చికిత్స తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకొని మాత్రమే చికిత్స తీసుకోవడం మంచిది.