వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్- ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత ఆఫ్గనిస్తాన్( Afghanistan ) పై భారీగా అంచనాలు పెరిగిన విషయం తెలిసిందే.ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫామ్ లోకి వచ్చేసింది.
ఇక తర్వాత మ్యాచ్ లలో కూడా ఇదే ఫామ్ కొనసాగించి వరుస మ్యాచ్లను గెలుస్తుంది అని అభిమానులు భావించారు.కానీ తాజాగా జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చాలా ఘోరమైన ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా సులభంగా టార్గెట్ ను చేజింగ్ చేస్తుందని అంతా అనుకున్నారు.కానీ న్యూజిలాండ్ పేసర్ల ధాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు.ఆఫ్ఘనిస్తాన్ జట్టు 139 పరుగులకే కుప్పకూలింది.
దీంతో న్యూజిలాండ్( New Zealand ) జట్టు 149 భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫీల్డింగ్ లోను, బ్యాటింగ్ లోను ఘోరంగా విఫలమైంది.మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ హాష్మతుల్లా షాహిది ( Hashmatullah Shahidi )తమ జట్టు ఆటగాళ్లు క్యాచ్లు మిస్ చేయడమే ఓటమికి ప్రధాన కారణం అని వ్యాఖ్యానించాడు.వరుసగా క్యాచ్లు మిస్ అవ్వడం వల్ల జట్టు సభ్యులంతా నిరుత్సాహానికి గురయ్యాం.
ఫీల్డింగ్ లోపాల వల్ల తాము వెనకబడ్డాం.అందుకే చివరి ఆరు ఓవర్లలో న్యూజిలాండ్ అధిక పరుగులు చేసింది.
ఒక వేళ క్యాచ్లు మిస్ చేయకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని చెప్పుకొచ్చాడు.టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం కూడా ఓటమికి ఒక ప్రధాన కారణమే.
పిచ్ ను సరిగా అర్థం చేసుకోలేకపోయాం.తొలి ఇన్నింగ్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది.
తమ జట్టు బౌలింగ్ పరంగా బాగానే ఉంది.కానీ ఫీల్డింగ్ లో లోపాల కారణమే ఓటమిని శాసించిందని తెలిపాడు.
తరువాత పాకిస్తాన్ తో ఆడే మ్యాచ్లో మా జట్టులోని లోపాల్ని సరిచేసుకుని తిరిగి బలంగా పోటీ పడతామని హాష్మతుల్లా షాహిది చెప్పుకొచ్చాడు.