ఇజ్రాయెల్-హమాస్ టెర్రరిస్టుల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై( Israel ) హమాస్ దాడితో ఈ యుద్ధం ప్రారంభమైంది.
ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తుండడంతో పోరు ఉధృతంగా మారింది.ఈ క్రమంలో గాజాలోని పాలస్తీనా ప్రజలకు ఇరాన్( Iran ) సహా ఇతర మధ్యప్రాచ్య దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.
దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు మరిన్ని దేశాలకు విస్తరిస్తుందేమోనని అంతా భయపడుతున్నారు.ఇదే కనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి( Third World War ) దారి తీసే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్( Joe Biden ) ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు.
ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని బహిరంగంగా ప్రకటించారు.దీనిపై అరబ్ దేశాలు మండిపడుతున్నాయి.చమురు( Oil ) ఉత్పత్తిని, సరఫరాను అరబ్ దేశాలు ఆపి వేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.
ఇజ్రాయెల్ దేశం 1948లో ఏర్పడింది.అప్పటి నుంచి ఆ దేశానికి అరబ్ దేశాలకు పడడం లేదు.అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగే సమయంలో ప్రపంచ దేశాలు ఎక్కువగా ఏదో ఒక వైపు ఉండేవి.1973 అక్టోబర్ 6న ఈజిప్టు, సిరియా నేతృత్వంలోని అరబ్ దేశాల సంకీర్ణ కూటమి సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి.
అరబ్ దేశాలకు రష్యా ఆయుధాలను అందించింది.దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలిచింది.6 రోజులు పాటు భీకరంగా సాగిన పోరులో ఇజ్రాయెల్ గెలిచింది.అయితే చమురు ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య ఒపెక్( OPEC ) కీలక ప్రకటన చేసింది.
అమెరికాతో( America ) పాటు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు చమురు సరఫరా ఆపేస్తామని ప్రకటించింది.సౌదీ అరేబియా, సిరియా ఇందులో కీలక పాత్ర పోషించాయి.అప్పటి వరకు చౌకగా లభించిన చమురు ధర పశ్చియ దేశాల్లో అమాంతంగా పెరిగింది.క్రమంగా అది ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది.
ఇలా 1971లోనే అరబ్ దేశాలు చమురు ఉత్పత్తి, సరఫరా ద్వారా పట్టు సాధించాయి.