ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో అన్నీ భాషల్లోనూ సక్సెస్ అయినా హీరోయిన్స్ లో ఒకరు శ్రీదేవి( Heroine Sridevi ).పాన్ ఇండియన్ స్టార్ అనే పదానికి నిర్వచనం తెలిపిన మొట్టమొదటి మహానటి ఆమె.అలాంటి సూపర్ స్టార్ కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్( Janhvi Kapoor ).కానీ ఈమె దురదృష్టం పాపం, ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా లేదు.
ప్రస్తుతం ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఈ సినిమా మీదనే జాన్వీ కపూర్ ఆశలన్నీ పెట్టుకుంది.హిట్ అయితే ఆమె రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుంది.
ఎందుకంటే ఆమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.సరైన హిట్ పడితే ఎదో ఒక రోజు వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది అని ట్రేడ్ సైతం బలంగా నమ్ముతుంది.
![Telugu Boney Kapoor, Devara, Janhvi Kapoor, Khushi Kapoor, Sridevi-Movie Telugu Boney Kapoor, Devara, Janhvi Kapoor, Khushi Kapoor, Sridevi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/Actress-Janhvi-Kapoor-reveals-the-time-she-wanted-to-quit-acting.jpg)
ఇది ఇలా ఉండగా జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్( Khushi Kapoor ) కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.ఆమె హీరోయిన్ గా ‘ఆర్చీస్’ అనే సినిమా చేస్తుంది.ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు ఖుషి కపూర్ ఎందుకో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట.చెల్లి అంటే ఎంతో ప్రేమ ఉండే జాన్వీ కపూర్ , ఆమె ఇబ్బంది పడుతుంది అనే విషయం తెలుసుకొని షూటింగ్స్ మొత్తానికి గుడ్బై చెప్పేసి, ఆమె సినిమా పూర్తి అయ్యే వరకు తన చెల్లితో కలిసి షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాలి అని అనుకుందట.
ఖుషి కపూర్ వద్దు అక్కా అని ఎంత చెప్పినా మాట వినలేదట జాన్వీ కపూర్.దీంతో బోణి కపూర్ ఒక రోజు జాన్వీ కపూర్ ని పిలిచి , నువ్వు షూటింగ్స్ ఆపేస్తే నిర్మాతలకు ఎన్నో కోట్లు నష్టం వస్తుంది.
దయచేసి అలా చెయ్యకు అని చెప్పాడట.
![Telugu Boney Kapoor, Devara, Janhvi Kapoor, Khushi Kapoor, Sridevi-Movie Telugu Boney Kapoor, Devara, Janhvi Kapoor, Khushi Kapoor, Sridevi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/janhvi-kapoor-devara-movie-Sridevi-bollywood-tollywood-social-media.jpg)
ఖుషి కపూర్ గురించి ఏమి కంగారు పడకు, అమ్మాయి కెమెరా ని ధైర్యం గా ఫేస్ చేసే వరకు నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పాడట.దీంతో జాన్వీ కపూర్ కూల్ అయ్యి సినిమా షూటింగ్స్ లో మళ్ళీ బిజీ అయ్యింది.ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో ‘దేవర'( Devara ) చిత్రం తో పాటుగా, మరో రెండు హిందీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
దేవర చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల అవ్వబోతుంది.ఈ సినిమా హిట్ అయితే ఇక స్టార్ హీరోలందరూ జాన్వీ కపూర్ డేట్స్ కోసం ఎదురు చూస్తారు.
చూడాలి మరి జాన్వీ కపూర్ అదృష్టాన్ని దేవర ఎలా మారుస్తుంది అనేది.