ఐఫోన్ 15ప్రో స్మార్ట్ ఫోన్ వేడెక్కుతుందా.. ఆపిల్ చెప్పే కారణాలు ఇవే..!

ఐఫోన్ 15 ప్రో( iPhone 15 Pro ) సిరీస్ స్మార్ట్ ఫోన్లు వేడెక్కుతున్నాయని ఆపిల్ కంపెనీకి ఫిర్యాదులు వస్తున్న క్రమంలో.ఆపిల్ సంస్థ స్పందిస్తూ.

 Iphone 15 Pro Overheating Issues Reasons By Apple Details, Iphone 15 Pro, Iphone-TeluguStop.com

ఈ సమస్యకు గల కారణాలను గుర్తించామని, దానిపై పనిచేస్తున్నట్లు తెలిపింది.సాఫ్ట్వేర్ అప్డేట్( Software Update ) ద్వారా ఈ సమస్యకు చెక్ పెడతామని సంస్థ పేర్కొంది.

అంతేకాకుండా ఇంస్టాగ్రామ్, ఉబర్ వంటి కొన్ని థర్డ్ పార్టీ యాప్ లకు ఇటీవలే వచ్చిన అప్డేట్ ల సిస్టంను ఓవర్ లోడ్ చేసినట్లు సంస్థ తెలిపింది.

కొన్ని సందర్భాలలో 80 ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతోందని, స్మార్ట్ ఫోన్ లను సరిగ్గా పట్టుకోలేకపోతున్నామని యూజర్లు ఫిర్యాదు చేశారు.ఇలా ఫోన్ వేడెక్కడానికి కొత్తగా తీసుకొచ్చిన A17 బయోనిక్ ప్రాసెసర్( A17 Bionic Processor ) మరియు టైటానిక్ ఛాసిస్ కారణం అని వినియోగదారులు భావిస్తున్నట్లు తెలిపారు.ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ మోడళ్లు వేడెక్కడానికి టైటానియం ఫ్రేమ్, అల్యూమినియం సబ్ స్ట్రక్టర్ కారణం కాదని సంస్థ తెలిపింది.

అయితే ఐఫోన్ 15 ప్రో మోడల్ లు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కేందుకు కారణం బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీ సహా iOS 17లో బగ్ అయి ఉండవచ్చని Mac Rumours నివేదిక తెలిపింది.

అంతేకాకుండా థర్డ్ పార్టీ యాప్ లు ( Third Party Apps ) కూడా కారణం అయ్యి ఉండవచ్చని తెలిపింది.అప్డేట్ వర్షన్ ఈ సమస్యకు చక్కటి పరిష్కారం కానుందని తెలిపింది.ఈ సమస్య పరిష్కారానికి ఇంస్టాగ్రామ్ యాప్( Instagram ) ఇప్పటికే 302 వెర్షన్ ను విడుదల చేసింది.

ఐఫోన్ వినియోగదారులు చింతించాల్సిన అవసరం లేదని, అప్డేట్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆపిల్ సంస్థ తెలిపింది.భారత మార్కెట్లో ఐఫోన్ 15 ప్రో వేరియంట్ ధర రూ.139900 గా ఉంది.ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వేరియంట్ ధర రూ.159900 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube