స్ట్రీలో సర్వసాధారణ విషయం.అయితే సినిమా రిజెక్ట్ చేయబడినప్పుడు అది హిట్ అయితేనే ఆ హీరోకి చాలా బాధగా ఉంటుంది.
అలాంటి ఒక చిత్రమే గౌతమీపుత్ర శాతకర్ణి.( Gouthama puthra shathakarni ) బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది.
ఇది బాలకృష్ణ ( Nandamuri Balakrishna )కెరియర్ లో వచ్చిన 100 సినిమా.ఈ సినిమా మొదట బాలకృష్ణ కాకుండా సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాలని అనుకున్నారట.కానీ అది జరగలేదు క్రిష్ దర్శకత్వంలో వచ్చి బాలకృష్ణ హీరోగా నటించడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది
ఇక ఈ సినిమా ఎన్టీఆర్ తను ముఖ్యమంత్రి గా 1994 ఎన్నికల్లో గెలవడానికి ముందు తీయాలి అనుకున్నాడట.ఆ సమయంలో తాను శాతకర్ణిగా నటించి తన కొడుకు పులోమావి పాత్రలో వెంకటేష్ చేత నటింపజేయాలని కూడా అనుకున్నాడట.కానీ ఆ తర్వాత ఎందుకో కాస్త ఆలస్యం కావడం, అటుపిమ్మటే ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు బిజీ కావడం మొత్తంగా మరోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడంతో ఈ ప్రాజెక్టు కాస్త అటకెక్కింది.అలా ఎన్టీఆర్ తో వెంకటేష్ నటించాల్సిన కాంబినేషన్ కూడా ఒక రకంగా మిస్సయింది అని చెప్పుకోవచ్చు.
కానీ చాలా ఏళ్ల తర్వాత ఇదే సబ్జెక్టుని బాలకృష్ణ తన వందవ సినిమాగా తీయాలని భావించాడు.
అనుకున్నదే తడువుగా సినిమా తీసి చిరంజీవి( Chiranjeevi ) పదేళ్ల తర్వాత గ్యాప్ తీసుకుని 150 వ సినిమాగా ఖైదీ నెంబర్ 150 ( Khaidi No 150 )చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా ఆ చిత్రానికి పోటీగా బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు విడుదల చేసి ఒక్కరోజు గ్యాప్ లో ఇద్దరు హీరోలు బంపర్ హిట్స్ కొట్టారు.ఇలా మొత్తానికి బాలకృష్ణ కెరియర్ లో మంచి సినిమాగా మిగిలిపోయిన ఈ చిత్రం వెంకటేష్( Venkatesh ) కి చేజారిపోయింది అని చెప్పవచ్చు.