తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనిత చౌదరి (Anitha Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో అనిత చౌదరి కాస్త సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఈమె వెండి తెరపైన బుల్లితెర పైన సందడి చేశారు.
ఇలా సినిమాలలోను సీరియల్స్ లోనూ నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి అనిత చౌదరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అనిత చౌదరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా అనిత చౌదరి మాట్లాడుతూ చిన్నతనంలోని కుటుంబ బాధ్యతలన్ని తనపై పడటంతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో నాకు పెళ్లి ( Marriage ) కూడా చేసుకోవాలని ఆలోచనలు రాలేదు ఇలా పెళ్లి గురించి నాకు ఏమాత్రం ఆసక్తి లేదు కానీ కృష్ణ చైతన్య( Krishna Chaitanya ) అనే వ్యక్తిని కలిసిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయని పెళ్లికూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి అంటూ తెలియచేశారు.అయితే కృష్ణ చైతన్యతో నా పెళ్లి జరగడానికి కారణం సినీ హీరో శ్రీకాంత్( Sreekanth ) అని తెలియజేశారు.శ్రీకాంత్ కారణంగానే మా ఇద్దరి పెళ్లి జరిగింది అంటూ అనిత చౌదరి తెలిపారు.
అనిత చౌదరి వివాహం చేసుకున్నటువంటి కృష్ణ చైతన్య స్వయంగా శ్రీకాంత్ కి కజిన్ బ్రదర్.కృష్ణ చైతన్య ప్రేమలో ఉన్నటువంటి అనిత చౌదరికి ఆయన ప్రపోజ్ చేసినప్పటికీ ఈమె పెళ్లి విషయంలో కాస్త బెట్టు చేయడంతో రంగంలోకి శ్రీకాంత్ దిగి వీరిద్దరి వివాహం చేశారని ఈమె తెలియజేశారు.ఈ విధంగా కృష్ణ చైతన్య శ్రీకాంత్ కు కజిన్ కావడంతో శ్రీకాంత్ ఈమెకు బంధువులు అవుతారని కూడా చెప్పాలి.
ఈ విధంగా అనిత చౌదరి తన పెళ్లి గురించి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
.