ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.ఎవరో ఒకరు మెగా ఫ్యామిలీలో ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉన్నారు.
మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు.మెగా హీరోల చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి.
అయితే ఇలాంటి తరుణంలో నాగబాబు( Nagababu ) నటించే చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలుస్తున్నాయి.నాగబాబు చేసిన బేబీ,( Baby Movie ) జైలర్( Jailer Movie ) చిత్రాలు ఎంత పెద్ద హిట్లుగా నిలిచాయో చెప్పాల్సిన పని లేదు.
నాగబాబు సినిమా ఆఫర్లు కావాలని, ఇవ్వమని ఏ ఒక్కరినీ అడగరు.తన వద్దకు వచ్చిన, నచ్చిన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ఉంటారు.అందుకే నాగబాబు ఎక్కువగా సినిమాల్లో కనిపించరు.ఆ మధ్య బుల్లితెరపై ఎక్కువగా సందడి చేశారు.
ఆ తరువాత రాజకీయం అంటూ తమ్ముడి వెంట నడుస్తున్నాడు.ఇప్పుడు మళ్ళీ అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు.
విచిత్రంగా ఆయన నటించే చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి.మిగతా మెగా హీరోల సినిమాలు( Mega Heros ) బోల్తా కొడుతున్నాయని సోషల్ మీడియాలో కొత్త వాదన తెరపైకి వచ్చింది.
గత సినిమాల పరిస్థితి చూసుకుంటే అది నిజమే అని అనిపిస్తుంది.

చిరంజీవి భోళా శంకర్,( Bhola Shankar ) పవన్ కళ్యాణ్ బ్రో,( Bro ) వరుణ్ తేజ్ గాండివధారి అర్జున( Gandeevadhari Arjuna ) ఇలా అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి.ఇందులో బ్రో సినిమా ఒకటే పరవాలేదు అనిపించేలా ఉంది.త్వరలో విడుదల కాబోతున్న వైష్ణవ్ తేజ్ మూవీ ఆదికేశవ పై( Adikeshava Movie ) అయితే ఇప్పటివరకు ఎటువంటి అంచనాలు లేవు.
ఉప్పెన తరువాత మళ్లీ ఇంత వరకు హిట్ కొట్టలేకపోయాడు.ఇలా మెగా హీరోలు రేసులో కాస్త వెనుకబడి ఉన్నారు.ఇాలాంటి టైంలో నాగబాబు పుంజుకుంటున్నాడు.

జైలర్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెబుతూ నోట్ విడుదల చేశాడు నెల్సన్.దానికి నాగబాబు రిప్లై ఇచ్చాడు.మీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు.
నాగబాబు ఇచ్చిన ఈ రిప్లై మీద నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ స్పందించారు.ఇలాంటి సినిమాలు తీయమని చిరుకి సలహాలు ఇవ్వు అంటూ నెటిజన్లు రిక్వెస్టులు చేస్తున్నారు.
నాగబాబుకి 2023 బాగా కలిసి వచ్చింది.క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన కూడా సినిమాలన్నీ మంచి హిట్ అవుతున్నాయి అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.