రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామం లో ఎల్లారెడ్డిపేట( Ellareddypet ) మండల లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో గ్రామంలో ఈరోజు 68 మంది గ్రామస్తులకు ఉచిత షుగర్, బిపి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.బీపీ షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్లను మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగింది.
బీపీ షుగర్ అదుపులో ఉంచుకోవడానికి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి , కోశాధికారి రావుల మల్లారెడ్డి, లయన్స్ క్లబ్ బాద్యులు సద్ది లక్ష్మారెడ్డి, కొలనూరి శంకర్, రావుల ముత్యం రెడ్డి, వంగల దేవయ్య, జన కంటి నాగరాజు, పిట్ల బాబు,తదితరులు పాల్గొన్నారు.