బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబోలో సినిమా ప్రకటించగానే అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.అందులోను షారుఖ్ పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తో కొన్నేళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.
దీంతో వెంటనే ఇదే ఊపులో మరో సినిమాను ప్రకటించడమే కాకుండా పూర్తి చేసి అంతే ఫాస్ట్ గా రిలీజ్ కూడా చేసాడు.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ తెరకెక్కగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించి మెప్పించాడు.
అలాగే ప్రియమణి, దీపికా పదుకొనె( Deepika Padukone ) కీ రోల్స్ పోషించి సినిమాను నెక్స్ట్ లెవల్ కు చేర్చారు.ఈ సినిమా మొన్న సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయగా మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
జవాన్ సినిమా( Jawan Movie )ను సౌత్ సినిమాలన్నిటి మిక్స్ చేసి తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.లాజిక్ తో పని లేకుండా అట్లీ తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ క్రియేట్ చేసాడు.జవాన్ సినిమాపై టాక్ చూస్తుంటే పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుఖ్ అదే విజయాన్ని జవాన్ తో కొనసాగిస్తాడు అని అనిపిస్తుంది.
ఇక మొదటి రోజు కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.జవాన్ మొదటి రోజు 129.6 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుందని తెలిపారు.దీంతో ఈ సినిమా హిందీ హిస్టరీలోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక నిన్న 2వ రోజు ఎంత రాబట్టిందో తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా వీకెండ్ లో జవాన్ కుమ్మేయబోతుంది అని తెలుస్తుంది.