ప్రస్తుత సమాజంలో ధనవంతులతో పోలిస్తే పేద ప్రజలే గొడ్డుకారం ఎక్కువగా తింటూ ఉంటారు.అందుకే పేద ప్రజలు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల(Chronic diseases ) బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.
అంతేకాకుండా 40 సంవత్సరాలకే డబ్బు ఉన్న వారిలో బీపీ, షుగర్ లాంటి దీర్ఘ కాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి.కానీ పేద ప్రజలకు మాత్రం అలాంటి అనారోగ్య సమస్యలు అసలు ఉండవు.
ఇదే విషయాన్ని తాజా అధ్యయనం తెలిపింది.ముఖ్యంగా చెప్పాలంటే వారానికి ఒక్కసారి కంటే తక్కువ స్పైసి ఆహారం తినేవారితో పోలిస్తే దాదాపు ప్రతిరోజు స్పైసి ఫుడ్ తినేవారిలో మరణ ప్రమాదం 14% తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
అలాగే క్యాన్సర్( Cancer ) గుండె జబ్బులు, శ్వాస కోశ వ్యాధులు దరిచేరే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.30 నుంచి 79 సంవత్సరాల వయసున్న ఐదు లక్షల మంది వ్యక్తులపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలను కనుగొన్నారు.ఏడు సంవత్సరాల పాటు వీరి ఆరోగ్యాన్ని పరిశీలించిన పరిశోధకులు ఈ కాలంలో 20,000 మంది చనిపోయినట్లు వెల్లడించారు.వీరు వారానికి ఒక్కసారి కంటే తక్కువ స్పైసీ ఫుడ్ ( Spicy food )తినే వారితో పోలిస్తే వారానికి ఒకటి కంటే రెండు రోజులు తినే వారిలో పది శాతం తక్కువ మరణ ప్రమాదం ఉందని వెల్లడించారు.
ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు గొడ్డు కారం తినే వారిని వారానికి ఒకసారి కంటే తక్కువగా గొడ్డు కారం తినే వారితో పోలిస్తే 14% తక్కువ మరణ ప్రమాదం ఉందని పరిశోధకులు( Researchers ) కనుగొన్నారు.ఈ వివరణ పురుషులు స్త్రీలలో ఒకే రకంగా ఉందని చెబుతున్నారు.మద్యం సేవించని వారు మరింత బలంగా ఉన్నారని వెల్లడించారు.తాజా సుగంధ ద్రవ్యాలు, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయని ఇప్పటికే చాలా అధ్యయనాలలో తెలిసింది.