సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) హీరోగా స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ”ఖుషి”.ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటింగ్ గా ఎదురు చూసారో అంత హిట్ అయ్యి వీరికి డబల్ కిక్ ఇస్తుంది.
విజయ్, సమంత( Samantha ) కూడా చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నారు.
ఇద్దరు కూడా గత సినిమాలతో ఘోర పరాభవం అందుకోగా వాటిని మరిపించే విధంగా ఇప్పుడు హిట్ అందుకున్నారు.
ఇక ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండడంతో మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఖుషి సినిమా( Kushi Movie )కు మంచి ఆదరణ లభిస్తుంది.
ముందు నుండి ఖుషి సినిమాకు యూఎస్ లో మంచి బుకింగ్స్ నమోదు కాగా ప్రీమియర్స్ ద్వారానే అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది.ఇక జస్ట్ ప్రీమియర్స్ కే 4 లక్షల డాలర్స్( Kushi US Premiers Collections ) ను టచ్ చేయగా డే 1 మొత్తం కలిసి 8 లక్షల డాలర్స్ ను క్రాస్ చేసింది.దీంతో 1 మిలియన్ మార్క్ చేరువలో ఈ సినిమా మొదటి రోజే వచ్చేసింది.
ఇక ఇప్పుడు రెండో రోజు కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది.
రెండు రోజుల కలెక్షన్స్ కలుపుకుని ఈ సినిమా అప్పుడే రికార్డ్ మైల్ స్టోన్ 1 మిలియన్ మార్క్( Kushi One Million Mark ) దాటేసినట్టు తెలుస్తుంది.దీంతో చాలా ఫాస్ట్ గా రెండు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో ఈ సినిమా చేరిపోయింది.ఇక ఆదివారం కూడా సూపర్ వసూళ్లు సాధించడం ఖాయం.
కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించగా హేషం అబ్దుల్ సంగీతం అందించారు.