తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS ) అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తరువాత , ఆ పార్టీలో చెలరేగిన కల్లోలం అంతా ఇంతా కాదు.టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇప్పటికీ బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా.
కొంతమంది పార్టీ కి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరిపోయారు.మరికొంతమంది చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్నవారు కావడం, గెలుపోవటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వారే ఎక్కువగా ఉండడంతో, ఇప్పుడు బీఆర్ఎస్ ఈ విషయంలో ఆందోళన చెందుతుంది.అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కొంతమంది కీలక నేతలకు నామినేటెడ్ పోస్టులను ఆఫర్ చేస్తూ, ఇంకొంతమందికి రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యం ఇస్తామనే హామీని ఇస్తున్నారు.

అయినా అసమ్మతి నేతలు మాత్రం తమ పంతం వీడేది లేదని చెబుతున్నారు.ఇక టికెట్( BRS Ticket ) దక్కించుకున్న నాయకులు, అసమ్మతి నేతల సహకారం కోరుతూ వారి ఇళ్లకు వెళుతున్నా, వారితో మాట్లాడేందుకు అసమ్మతినేతలు ఎవరు ఇష్టపడడం లేదు.బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే( Sitting MLAs ) కావడంతో ఇప్పటివరకు తమను అన్ని విధాలుగా అణిచివేతకు గురి చేశారని, నియోజకవర్గంలో తమకు గట్టిపట్టు ఉన్నా , బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదని, ఇప్పుడు టిక్కెట్ దక్కించుకున్న వారిని ఓడించి తీరుతామని సవాళ్లు చేస్తున్నారు.ఇప్పటికే అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రులు హరీష్ రావు ,( Harish Rao ) గంగుల కమలాకర్,( Gangula Kamalakar ) ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీష్ రెడ్డి వంటి వారిని కేసీఆర్ ( CM KCR ) రంగంలోకి దింపారు.
అయితే వీరు బుజ్జగించి నా అసమ్మతి నేతలు మాత్రం తమ పంతం వీడేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు .

దీంతో కేసిఆర్ కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.ఇక చాలామంది అసంతృప్తినేతలు కేటీఆర్ ( KTR ) కోసం ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈనెల 6వ తేదీన తెలంగాణలో అడుగుపెట్టనున్నారు.
ఆయన వచ్చిన తర్వాత తమకు జరిగిన అన్యాయంపై కేటీఆర్ వద్ద తేల్చుకుని తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం అసమతికి గురైన వారిలో ఎక్కువమంది కేటీఆర్ కు సన్నిహితులే కావడంతో, వారి అసమ్మతిని తగ్గించి మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యేలా కేటీఆర్ మాత్రమే చేయగలరని నమ్మకం కేసిఆర్ తో పాటు ఇతర మంత్రులలోనూ వ్యక్తం అవుతుంది.