జనగాం జిల్లాలోని పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో టికెట్ వార్ నడుస్తోంది.పాలకుర్తి నియోజకవర్గం టికెట్ కోసం ఇద్దరు ఎన్నారైలు పోటీ పడుతున్నారని తెలుస్తోంది.
ఎన్నారైలు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డి మధ్య టికెట్ వార్ రాజుకుంది.దీంతో పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది.
ఈ క్రమంలోనే ఝాన్సీ రెడ్డికి భారత పౌరసత్వం లేదని తిరుపతి రెడ్డి ఆరోపిస్తుండగా .ఆయనకు వ్యతిరేకంగా ఝాన్సీరెడ్డి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోవడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొందని సమాచారం.అయితే పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికీ కేటాయిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.