ప్రస్తుతం ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల ( smartphones )వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో వేరే చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇండియా రెండో స్థానానికి చేరుకుందంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు… ఇక్కడ ఫోన్ల వాడకం గురించి.
ఈ క్రమంలో ఇంటర్నెట్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది అనుకోవడంలో అతిశయోక్తి లేదు.కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్‌లు తీసుకొస్తున్నాయి.
తాజాగా భారత టెలికాం ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న రిలయన్స్ జియో( Reliance Jio ) ఓ అదిరిపోయే కొత్త ప్లాన్‌ని ప్రకటించింది.లేటెస్ట్ ప్లాన్స్ తో రీఛార్జి చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు.
ఆ ప్లాన్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో మొదటిది రూ.1099 ప్రీపెయిడ్ ప్లాన్.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు కాగా దీనిద్వారా కస్టమర్లు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్, అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలను పొందగలరు.ఇక ఈ ప్లాన్‌కు నెట్‌ఫ్లిక్స్ మొబైల్‌ప్లాన్ సబ్‌స్క్రిప్షన్( Netflix MobilePlan Subscription ) పొందాలంటే కస్టమర్లు నెలకు రూ.149, సంవత్సరానికి రూ.1788 చెల్లించాల్సి ఉంటుంది.ఈ లిస్టులో 2వ ప్లాన్ రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్.ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు కాగా రోజుకు 3GB డేటా, అపరిమిత 5G డేటా, అపరిమిత వాయిస్ కాల్ వంటి ప్రయోజనాలు ఉంటాయి.ఈ ప్లాన్‌కు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ.199, సంవత్సరానికి రూ.2,388 చెల్లిస్తే సరిపోతుంది.
ఇకపోతే మీరు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే, నెట్‌ఫ్లిక్స్‌ను ఫోన్ లేదా టాబ్లెట్‌లో మాత్రమే చూడాలనుకుంటే రూ.1,099 ప్రీపెయిడ్ ప్లాన్, పెద్ద స్క్రీన్‌పై నెట్‌ఫ్లిక్స్‌ను ఆస్వాదించాలనుకుంటే, రూ.1,499 ప్లాన్ రీచార్జ్ చేసుకోవడం ఉత్తమం.దానికోసం మీరు రిజిస్టర్డ్ Jio మొబైల్ నంబర్‌ని ఉపయోగించి మీ టీవీ లేదా కంప్యూటర్‌లో Netflixకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది.కాగా, ప్రీపెయిడ్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లను అందించే ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి టెలికాం ఆపరేటర్‌గా జియో అవతరించింది.
జియోతో సహా ఇతర టెలికాం ఆపరేటర్లు ఇప్పటికే పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లతో నెట్‌ఫ్లిక్స్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.