తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ల మ్యూజిక్ తో జనాలని అలరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు…ఇక ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్, తమన్( Thaman S ) లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగులో మంచి పాపులారిటీ తో దూసుకుపోతున్నారు… అయితే తమన్, దేవి మధ్య పోటీ అనేది చాలా సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది.ఈ పోటీ లో మొదట దేవి శ్రీ ప్రసాద్ విజయం సాధించినప్పటికీ ఇప్పుడు మాత్రం తెలుగు ఇండస్ట్రీ లో తమన్ హవా నే నడుస్తుంది.నిజానికి వీళ్ళిద్దరిలో మ్యూజిక్ పరం గా దేవి బెస్ట్ కానీ తమన్ సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని అందరూ తీసుకుంటున్నారు… అలాగే తమన్ మ్యూజిక్ కూడా చాలా తొందర గా ఇచ్చేస్తాడు కాబట్టి ఆయన్ని తీసుకుంటున్నారు అనేది మరో కారణం…
అయితే మ్యూజిక్ డైరక్టర్ల మధ్య పోటీ అనేది ఇప్పటి నుంచి వస్తున్నది కాదు అప్పట్లో ఇళయ రాజా( Ilaiyaraaja ) కి, కీరవాణి కి మధ్య కూడా మంచి పోటీ ఉండేది ఇద్దరు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లు అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి హెల్తీ కాంపిటీషన్ ఉండేది…ఇప్పుడు కూడా తమన్,దేవి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిన కూడా సినిమాల పరంగా ఎప్పుడు పోటీ పడుతునే ఉంటారు…ఇక ప్రస్తుతం దేవి చేతిలో ఒక పుష్ప 2 మాత్రమే ఉండటం కొంతవరకు ఆయన కెరియర్ డౌన్ లో ఉందనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది … అయితే ఈ సినిమా మ్యూజిక్ తో మళ్ళీ దేవి ఇస్ బ్యాక్ అనిపించుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
అయితే వీళ్లలో ఎవరు బెస్ట్ అంటే చాలా మంది కూడా దేవి( Devi Sri Prasad ) నే బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు అంటూ చెప్తుంటారు ఎందుకంటే తమన్ మ్యూజిక్ అంత కూడా కాపీ నే కాబట్టి దేవి నే మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తూ ఉంటారు…ఇక మళ్ళీ కంబ్యాక్ కోసం దేవి చాలా బాగా కష్టపడుతున్నట్టు గా తెలుస్తుంది.అప్పట్లో దేవి సినిమాల కోసం సూపర్ ఆల్బమ్స్ ఇచ్చేవాడు…ఆయన చేసిన ప్రతి సాంగ్ కూడా సూపర్ సక్సెస్ అయ్యేది అందుకే ఆయన అన్న, ఆయన మ్యూజిక్ అన్న అందరికీ చాలా ఇష్టం ఉంటుంది…