రాహుల్ యాత్ర మళ్ళీ షురూ.. ఈసారి ప్లానెంటో ?

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలే సమయం ఉంది.దాంతో అధికారమే లక్ష్యంగా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ </em( Congress party )వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

 Rahul Yatra Starts Again.. What Is The Plan This Time, Rahul Gandhi, Congress Pa-TeluguStop.com

ఇప్పటికే విపక్షాలతో INDIA కూటమిని ఏర్పరచిన కాంగ్రెస్ మోడి సర్కార్ కు చెక్ పెట్టేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది.ఈసారి ఎన్నికలు హస్తం పార్టీకి డూ ఆర్ డై లాంటివనే చెప్పాలి ఎందుకంటే.2014, 2019 ఎన్నికల్లో వరుస ఓటములు చవి చూసిన హస్తం పార్టీ ఈసారి ఓడిపోతే పార్టీ పూర్తిగా బలహీన పడే అవకాశం ఉంది.అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది హస్తం పార్టీ.

Telugu Brs, Congress, Rahul Gandhi, Ycp-Politics

అందులో భాగంగానే పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీ( Rahul Gandhi ) గత ఏడాది భారత్ జోడో యాత్ర ప్రారంభించారు.ఈ యాత్ర హస్తం పార్టీలో పునః జోష్ నింపించనే చెప్పాలి.అంతకు ముందు స్తబ్దంగా సాగిన హస్తం పార్టీ వైఖరి జోడో యాత్రతో ఒక్కసారిగా ఊపందుకుంది.కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిన రాహుల్ యాత్ర అన్నీ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ కు మళ్ళీ జీవం పోషిందనే చెప్పాలి.

ఇక ఇప్పుడు జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ సిద్దమౌతున్నారట.సెప్టెంబర్ 5 నుంచి యాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Brs, Congress, Rahul Gandhi, Ycp-Politics

ఈసారి పడమర నుంచి తూర్పు కు సాగేలా గుజరాత్ నుంచి త్రిపుర వరకు యాత్ర ఉండేలా కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.మరి రాహుల్ గాంధీలో రాజకీయ పరిణితికి జోడో యాత్ర ఎంతగానో ఉపయోగ పడిందని విశ్లేషకులు చెబుతుంటారు.మరి అలాంటి జోడో యాత్ర ( Bharat Jodo Yatra )రెండవ దశ ప్రారంభం అవుతుండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ యాత్రను ఎన్నికల ముందు పూర్తి చేసి ఆ తరువాత ప్రచారానికి వెళితే పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశిష్టానం భావిస్తోందట.

మరి ఈసారి రాహుల్ గాంధీ మునుపటి జోష్ కొనసాగిస్తారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube