భారత్- వెస్టిండీస్ ( Ind vs WI ) వన్డే సిరీస్ లో భాగంగా జూలై 27న తోలి వన్డే మ్యాచ్ బార్బడస్ వేదికగా జరుగనుంది.అయితే వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ భారీ రికార్డులపై కన్నేశారు.
విరాట్ కోహ్లీ( Virat Kohli ) మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13 వేల పరుగులు పూర్తవుతాయి.విరాట్ కోహ్లీ 274 వన్డే మ్యాచ్లు ఆడి 46 సెంచరీలు, 65 అర్థ సెంచరీలతో 12898 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ 175 పరుగులు చేస్తే వన్డేల్లో పదివేల పరుగులు పూర్తవుతాయి.రోహిత్ శర్మ( Rohit Sharma ) 243 వన్డే మ్యాచ్లు ఆడి 30 సెంచరీలు, 48 అర్థ సెంచరీలతో 9825 పరుగులు చేశాడు.
అయితే వర్షాల కారణంగా మ్యాచులు డ్రా అయితే ఈ రికార్డులు సాధ్యం అవడం కష్టమే.ఇటీవలే జరిగిన టెస్ట్ సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్లో 141 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా దూకుడు ఆడి ప్రత్యర్థి జట్టు ముందు భారీ టార్గెట్ నే ఉంచింది.కానీ వర్షం మ్యాచ్ డ్రా అవడంతో సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ను డ్రా గా సరిపెట్టుకుంది.
కాబట్టి వన్డే సిరీస్ పై( ODI ) కూడా వర్ష ప్రభావం పడే అవకాశం ఉంది.
రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా కావడంతో దాని ప్రభావం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్ పై పడింది.రెండో టెస్ట్ మ్యాచ్లో గెలిచి ఉంటే డబ్ల్యూటీసి( WTC ) పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండేది.ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జులై 27, జులై 29, ఆగస్టు 1వ తేదీలలో వన్డే మ్యాచ్లు జరుగనున్నాయి.
అనంతరం ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీలలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది.వెస్టిండీస్ పర్యటన తర్వాత భారత్ నేరుగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.