రాజన్న సిరిసిల్ల జిల్లా : బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి నియోజకవర్గ కమిటీ అలువాల అజయ్ ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి ( Boinapally )మండలంలోని మల్లాపుార్ లో ప్రారంభం అయిన సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జ్ మేకల రవిందర్, జోనల్ కన్వినర్ జన్ను స్వరుాప తో కలిసి హజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆగష్టు 6 న చొప్పదండి జరిగే బహుజన రణబేరి సభను విజయవంతం చేయడం కోసం బహుజన రాజ్యాదికార సైకిల్ యాత్ర ను ఈ రోజు మల్లాపుార్ లో ప్రారంబించడం జరిగింది.
డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని బహుజనుల బతుకులు మార్చడం కోసం తను రాజీనామా చేశాడని వారు పేర్కొన్నారు.చొప్పదండి నియోజకవర్గం లో బహుజన రాజ్యాన్ని సాదించడం కోసం బహుజనులంతా ఏకం అయి బిఎస్పీ కి అదికారాన్ని ఇవ్వాలని వారు పేర్కొన్నారు…
ఈ సందర్భంగా సైకిల్ యాత్రలో అసెంబ్లీ ఇంచార్జ్ లు కొంకటి శేఖర్, మంద రవిందర్, జిల్లా కమిటీ సభ్యులు మాంకాళి తిరుపతి,అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజెందర్, ఉపాద్యక్షులు షమీమ్, ప్రధాన కార్యదర్శి భుాత్కుారి కాంత, కోశాదికారి పిట్ట మనోహర్, బోయినపల్లి మండల అద్యక్షులు అలువాల అజయ్( Ajay ), గంగాధర మండల అద్యక్షులు పొత్తుారి సురేష్,కొడిమ్యాల్ మండల అద్యక్షులు సైదల దుర్గయ్య,రామడుగు అద్యక్షులు కాశపాక తిరుపతి, బోయినపల్లి ఉపాద్యక్షులు ఇల్లందుల అరుణ్ కుమార్, కొడిమ్యాల్ మండల ఉపాద్యక్షులు పెంట మల్లేశం, రామడుగు మండల ప్రధాన కార్యదర్శి నుానె సత్యం, వెదిర సెక్టార్ అద్యక్షులు సంతోష్ కుమార్( Santosh Kumar ), ఆర్నకొండ సెక్టార్ అద్యక్షులు తమ్మడి నవీన్, విలాసాగర్ సెక్టార్ అద్యక్షులు కట్కుారి అంజనేయులు, కల్లెపెల్లి రిషి తదితరులు పాల్గొన్నారు…