తెలంగాణ రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని గద్వాల, నారాయణ పేట్, ములుగు, వరంగల్, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి.ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కాగా తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 29 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.