ఒకసారి కొండెక్కిపోయే ధరలు.. మరోసారి పంట రోడ్డుపాలు.. బలయ్యేది రైతులు, సామాన్యులేనా?

ప్రస్తుతం కూరగాయల మార్కెట్ లో కేజీ టమాటాలు( kg tomatoes ) కొనుగోలు చేయాలంటే 150 రూపాయలు, కేజీ మిర్చి( Chili ) కొనుగోలు చేయాలంటే 150 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఈ పంటలు పండటానికి అనుకూల పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లోనే ఉండటంతో ఈ కూరగాయల ధరలు ఈ స్థాయిలో పెరిగాయి.

 Farmers Reality About Selling Vegetables Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

మరికొన్ని రోజుల్లో టమాటా ధరలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం అయితే లేదు.

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొనేటట్టు, తినేటట్టు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే పంటలకు మంచి రేట్లు పలుకుతుండటంతో రైతులు సంతోషిస్తున్నారు.చాలా కాలం తర్వాత తమకు కొంతమేర మంచి లాభాలు వస్తున్నాయని వాళ్లు చెబుతున్నారు.

అయితే రేట్లు పెరిగినా రైతులకు వచ్చే లాభం కంటే దళారీలు, కమీషన్ ఏజెంట్లకే ఎక్కువగా బెనిఫిట్ కలుగుతుంది.

Telugu Chili, Farmers, Kg Tomatoes, Unemployed, Vegetables-Latest News - Telugu

అయితే కొంతమేర ధరలు పెరిగితే కొంతమంది మేమెలా బ్రతకాలంటూ గగ్గోలు పెడుతుండగా రైతులు( Farmers ) మాత్రం మేము పంటలను రోడ్లపై పారేసిన సమయంలో ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు.ధరలు పెరిగితే రైతులు లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతున్నారు.అయితే ధరలు పెరిగినా, తగ్గినా ఎగువ మధ్యతరగతి, ధనికులపై పెద్దగా ప్రభావం లేదు.

Telugu Chili, Farmers, Kg Tomatoes, Unemployed, Vegetables-Latest News - Telugu

రైతులకు ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్లే చాలా సందర్భాల్లో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.కూరగాయల సాగు అంతకంతకూ తగ్గుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు అటు రైతులకు, ఇటు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రైతే రాజులా బ్రతికేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.పండించే రైతుల కష్టాలను గురించి తెలుసుకుని రైతులను ప్రోత్సహిస్తే రైతులకు బెనిఫిట్ కలుగుతుంది.

నిరుద్యోగులకు( unemployed ) వ్యవసాయంపై అవగాహన, ఆసక్తి కలిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో అయినా ఈ దిశగా అడుగులు వేస్తాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube