ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అనేక ఆహార పదార్థాలను చిరు వ్యాపారులు విక్రయిస్తూ ఉంటారు.టిఫిన్లు, భోజనం, బిర్యానీ లాంటివి విక్రయిస్తూ ఉంటారు.
అలాగే టీ, కాఫీ, వాటర్ బాటిల్, బిస్కెట్లు లాంటివి అమ్ముతూ ఉంటారు.ఇవే కాకుండా వేరుశెనగలు, సమోస లాంటి అనేక ఆహార పదార్థాలను విక్రయిస్తూ ఉంటారు.
అయితే ట్రైన్ లో పానీపూరి విక్రయించడం మీరు ఎప్పుడైనా చూశారా.తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఒక వ్యక్తి పానీపూరి విక్రయిస్తూ ట్రైన్ లో కనిపించాడు.దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
div class=”middlecontentimg”>
ఒక వ్యక్తి లోకల్ ట్రైన్ లో పానీపూరి ( Pani Puri )అమ్ముతున్నాడు.కదురుతున్న ట్రైన్ లో పానీపూరి విక్రయించాడు.దీంతో చాలామంది అతడి దగ్గర పానీపూరి తిన్నారు.కొంతమంది ప్రయాణికులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ట్రైన్ లో కూడా పానీపూరి అమ్మడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ పెట్టారు.దీంతో ఆ వీడియో ట్రెండింగ్ గా మారింది.
అతడు పానీపూరి విక్రయిస్తుండగా.చాలామంది చుట్టూ చేరి పానీపూరి తింటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
అయితే ఇది ఏ ప్రాంతంలో జరిగింది.ఏ ట్రైన్ లో జరిగిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు.
అయితే వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతూ ఉంది.
div class=”middlecontentimg”>
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.పానీపూరి కోసం ఆగాల్సిన పనిలేదని, ట్రైన్( Train ) జర్నీలోనే హాయిగా తినవచ్చని అంటున్నారు.సాగర్ అనే ట్విట్టర్ యూజర్ ట్రైన్ లో పానీపూరి విక్రయిస్తున్న వీడియోను షేర్ చేశాడు.
మీ వ్యాపారాన్ని సరైన మార్గంలో పెట్టండి అంటూ రాసుకొచ్చాడు.పానీపూరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.
ఇక అమ్మాయిలైతే మరింతగా ఇష్టపడతారు.సాయంత్రం అయితే చాలు పానీపూరి బండి దగ్గర క్యూ కడతారు.
స్నేహితులతో కలిసి లోట్టలేసుకుంటూ పానీపూరిని ఆరగిస్తారు.