ఈ ప్రపంచంలో ప్రసూతి మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ ఈ మరణాలను ఆపలేకపోతున్నారు.
ఇక్కడ ప్రతి 7 సెకన్లకు ఎక్కడో ఒకచోట నవజాత శిశువు( newborn baby ) మరణించడం లేదా ప్రసవం సమయంలో తల్లి మరణించడం అనేది జరుగుతోంది.తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు, కావాల్సిన పెట్టుబడులను తగ్గించడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది.ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రసవ సమయంలో లేదా ప్రసవం జరిగిన మొదటి వారంలో ఏటా 4.5 మిలియన్ల మంది పిల్లలు, శిశువులు మరణిస్తున్నట్టు సర్వేలో తెలిసింది.
అవును, దానిని బట్టి ఇక్కడ ఏం అర్థమౌతోంది అంటే ప్రతి 7 సెకన్లకు ఒక తల్లి లేదా అప్పుడే పుట్టిన బిడ్డ మరణిస్తున్నారని.ఈ మరణాల్లో చాలా వరకు నివారించదగినవే అయినప్పటికీ అవసరమైన ఆరోగ్య పరికరాలు, వైద్యులు అందుబాటులో లేని కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది.యునైటెడ్ నేషన్స్( United Nations ) ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 మిలియన్ల నవజాత శిశువులు మరణిస్తున్నారు, అంటే పుట్టిన మొదటి నెలలోనే వీరు వివిధ ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్నారన్నమాట.ఇక నవజాత శిశువుల సంరక్షణ యూనిట్లు కూడా చాలాచోట్ల అందుబాటులో లేవు.దీనివల్లే అక్కడ ఎక్కువ మంది పిల్లలు, తల్లులు మరణిస్తున్నారు.
ఇక ఆఫ్రికా దేశాల్లో అయితే మరీ ఘోరం.నెలలు నిండకుండా పుడుతున్న శిశువులను కాపాడేందుకు ఆరోగ్యపరమైన ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉండవు.దీనివల్లే అక్కడ పిల్లలు అధికంగా చనిపోతున్నారు.సెప్సిస్, నిమోనియా, మెనింజైటిస్, నియోనాటల్ టెటానస్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడిన శిశువులు ఎక్కువగా మరణిస్తున్నారు.కొందరు నవజాత శిశువులకు గుండె లోపాలు, నాడీ ట్యూబ్ లోపాలు( Heart defects, neural tube defects ) పుట్టుకతో రావచ్చు.ఇవి కూడా మరణానికి దారితీయవచ్చు.
అందుకే ఇక్కడ సమస్యను తొలిదశలోనే గుర్తించడం చాలా అవసరం.కానీ అది జరగడం లేదు.
బిడ్డ పుట్టిన వెంటనే అనారోగ్యం పాలైతే వారిని కాపాడే నియోనాటల్ అంబులెన్స్, శిక్షణ పొందిన పారామెడిక్స్ కూడా చాలా దేశాల్లో అందుబాటులో ఉండడం లేదనేది నిపుణులు వాదన.