ఈ కారు ఇండియాలోనే అత్యంత ఖరీదైనది.. దాని ఓనర్ ఎవరో తెలిస్తే!

ప్రముఖ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడే లగ్జరీ కార్లను తయారు చేస్తుంది.ఇండియాలో కూడా ఆ లక్జరీ కార్లను రిలీజ్ చేస్తుంది.

 This Car Is The Most Expensive In India.. If You Know Who Owns It! Viral News, T-TeluguStop.com

అయితే భారతదేశంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ కారు అయిన బెంట్లీ ముల్సాన్ EWB సెంటినరీ ఎడిషన్ ఇటీవల బెంగళూరు( Bengaluru )లో కనిపించింది.ఈ ప్రత్యేక కారు ధర అక్షరాలా రూ.14 కోట్లు.

ఈ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ బెంట్లీ యజమాని అంబానీనో లేదా ఆదానీనో అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.

ఎందుకంటే ఈ యజమాని గురించి ఇప్పటివరకు ప్రపంచానికి పెద్దగా తెలియదు.ఆయన పేరు వీ.ఎస్ రెడ్డి అతను బ్రిటిష్ బయోలాజికల్స్ అనే కంపెనీ స్థాపించి దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.రెడ్డి లగ్జరీ కార్లకు పెద్ద అభిమాని.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ కుబేరుడు దేశంలోని అన్ని విభిన్న బ్రాండ్ల నుంచి కార్లను సేకరించాలని తన కోరికను వ్యక్తం చేశారు.అతను బెంట్లీని ప్రసిద్ధ తాజ్ మహల్ లాగా, అందం, వైభవానికి చిహ్నంగా భావిస్తారు.

Telugu Bengaluru, Bentley, Expensive, Karnatka, Luxury Cars, Reddy-Latest News -

వీఎస్ రెడ్డి( VS Redd ) కర్ణాటక రాష్ట్రంలో 52 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.వివిధ వయసుల వారికి సరసమైన నివారణ పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో అతను బ్రిటిష్ బయోలాజికల్స్‌( British Biologicals )ను ప్రారంభించారు.ఈ కంపెనీ ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించింది.పీడియాట్రిక్, డయాబెటిక్, గైనకాలజీ, కార్డియోవాస్కులర్, హెపటైటిస్, జెరియాట్రిక్ న్యూట్రిషన్ వంటి వివిధ అవసరాల కోసం పోషకాహార ఉత్పత్తులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది.

Telugu Bengaluru, Bentley, Expensive, Karnatka, Luxury Cars, Reddy-Latest News -

రెడ్డికి చెందిన బెంట్లీ కారు రోజ్ గోల్డ్‌లో ప్రత్యేకమైన షేడ్ కలిగి ఉంది.21-అంగుళాల పాలిష్ చేసిన అల్లాయ్ వీల్స్, విలాసవంతమైన లెదర్ సీట్లు, వెనుక క్వార్టర్ వానిటీ మిర్రర్లు, మృదువైన గొర్రె ఉన్నితో చేసిన రగ్గులు వంటి ఫీచర్లతో ఇది వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube